HomeTelugu Newsఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి చర్యలు

ఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత ప్రమాణాలతో ఫిలిం అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో సినీ పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని, దీనికోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తామని ప్రకటించారు. నిన్న శుక్రవారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, మరో నటుడు రానా కలిసి సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీరంగం అభివృద్ధిపై చర్చించారు.

4 2

రాజధాని అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక సుందరమైన ప్రదేశాలు సినీ పరిశ్రమకు ఎంతగానో ఉపయోగపడతాయని, సినీ టూరిజం అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రోత్సహించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలతో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమకు తాము సహకరిస్తామని, ఏపీలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఆకట్టుకుంటున్నాయని, ఏపీలో సినీ పరిశ్రమ నిలదొక్కుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని సినీ ప్రముఖులు
అభిప్రాయపడ్డారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!