HomeTelugu Newsఏయన్నార్‌ పాత్రలో సుమంత్‌

ఏయన్నార్‌ పాత్రలో సుమంత్‌

‘ఎన్టీఆర్‌’ సినిమాలో అక్కినేని నాగేశ్వరావు పాత్రలో నాగచైతన్య నటించనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ పాత్రలో నటుడు సుమంత్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని సుమంత్‌ తానే స్వయంగా ట్వీట్టర్‌ ద్వారా తెలియచేశారు. ‘ఎన్టీఆర్‌ బృందంతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో మా తాతయ్య ఏయన్నార్‌ పాత్రను పోషిస్తున్నా. ధన్యవాదాలు’ అని సుమంత్‌ పేర్కొన్నాడు. ‘ఎన్టీఆర్‌’ సినిమా లో ప్రధాన పాత్ర నందమూరి బాలకృష్ణ చేస్తుండగా, జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

9 2

ఇక ఈ చిత్రంలో చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నట్లు సమాచారం. ఇక కృష్ణ, శ్రీదేవి తదితర పాత్రల్లో ఎవరు నటించనున్నారనే విషయంపై ప్రకటన రావాల్సి ఉంది. అయితే, యంగ్‌ ఎన్టీఆర్‌గా మోక్షజ్ఞ, కృష్ణగా మహేశ్‌బాబు, సావిత్రిగా కీర్తి సురేశ్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రామానాయుడుగా వెంకటేశ్‌ కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌లో రానా చేరారు. సంక్రాంతికి జనవరి 9న ఈ బయోపిక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!