అమ్మ పాత్రలో ఒదిగిపోయిన నిత్యామీనన్‌.. ‘ది ఐరన్‌ లేడీ’ ఫస్ట్‌లుక్‌

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ది ఐరన్‌ లేడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రియదర్శిని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ రోజు జయలలిత వర్థంతిని పురస్కరించుకుని చిత్రబృందం సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. లుక్‌లో నిత్యామీనన్‌ జయలలిత పాత్రలో ఒదిగిపోయారు. అచ్చం ఆమెలాగే కన్పిస్తున్నారు.

పేపర్‌టేల్‌ పిక్చర్స్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది. మరోపక్క ‘మదరాస పట్టణం’ ఫేమ్‌ విజయ్‌ కూడా జయలలితపై బయోపిక్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు.తమిళనాడు ప్రజల గుండెల్లో ‘అమ్మ’ గా ముద్ర వేసుకున్న జయలలిత రాజకీయ, సినీ జీవితాల్లోని ముఖ్య ఘట్టాలన్నీ ఈ చిత్రంలో కనిపించనున్నాయని చిత్రబృందం తెలిపింది.

CLICK HERE!! For the aha Latest Updates