HomeTelugu Newsఒకేరోజు బాక్సాఫీస్ బరిలో 4 సినిమాలు

ఒకేరోజు బాక్సాఫీస్ బరిలో 4 సినిమాలు

బాక్సాఫీస్ దగ్గర జూన్ 1న 4 సినిమాలు అదష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మే నెలలో విడుదల కావాల్సి ఉన్న ఈ నాలుగు సినిమాలు జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ”ఆఫీసర్” మూవీ జూన్ 1న విడుదల కాబోతుంది. మే 25న రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నా పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల ఆలస్యంతో రిలీజ్ తేదీని జూన్ 1కి వాయిదా వేశారు.

1 3

కల్యాణ్ రామ్-తమన్నా జంటగా నటించిన ”నానువ్వే” చిత్రం కూడా జూన్ 1న విడుదల కాబోతుంది. మే 25న విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాకు థియేటర్స్ సమస్యతో రిలీజ్ వాయిదా పడింది.

ఎన్నో వాయిదాల తర్వాత రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన రాజుగాడు సినిమా కూడా జూన్ 1న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సంజన రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరో రాజ్ తరుణ్ వింత వ్యాధితో బాధపడుతున్న యువకుడి పాత్రను పోషిస్తున్నాడు.

విశాల్-సమంత జంటగా నటించిన అభిమన్యుడు చిత్రం జూన్ 1న రిలీజ్ కాబోతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఇరుంబు తిరై చిత్రాన్ని తెలుగులో అభిమన్యుడు పేరుతో విడుదల చేస్తున్నారు. జూన్ 1న విడుదలయ్యే నాలుగు సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర ఎన్ని విజయాలు సాధిస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!