Homeతెలుగు Newsకొండనైనా బద్దలు చేసే శక్తి టీడీపీకి ఉంది: చంద్రబాబు

కొండనైనా బద్దలు చేసే శక్తి టీడీపీకి ఉంది: చంద్రబాబు

మోసం చేసిన వారిని వదిలి పెట్టడం తెలుగువారి లక్షణంకాదు.. కసిగా పోరాడుదాం..ఎన్డీఏ మెడలు వంచి హక్కులు సాధించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలులో టీడీపీ ధర్మపోరాట సభకు చంద్రబాబు హాజరై ప్రసంగించారు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి ఆనాడు బ్రిటీష్‌ వారి గుండెల్లో ఎలా రైళ్లు పరుగెత్తించారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని.. నరేంద్రమోదీ గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలి. తెలుగువారి సత్తా ఏమిటో నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్‌ స్ఫూర్తి మనకుంది. ఐదు కోట్ల మంది అండగా ఉంటే కొండనైనా బద్దలు చేసే శక్తి టీడీపీకు ఉంది అని సీఎం వివరించారు.

14 6

పోలవరం తెలుగు జాతి జీవనాడి.. పోలవరం పూర్తి చేయడమే నా జీవితాశయం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా మారుస్తాం. కృష్ణా-గోదావరి నదులు అనుసంధానం చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నాం. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి.. ఏపీకి అన్యాయం చేశారు. విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వలేదు, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. అవినీతి ఉచ్చులో పడ్డారు.. దాని ఫలితం ఎన్నికల్లో తెలుస్తుంది అని చంద్రబాబు హెచ్చరించారు.

ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. మనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసేందుకే ధర్మపోరాట సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాయలసీమలోని చెరువులకు నీళ్లు ఇచ్చి సీఎం ఆదుకున్నారని కేఈ వివరించారు. రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, అఖిలప్రియ, ఎంపీలు కొనకళ్ల నారాయణ, జేసీ దివాకర్‌రెడ్డి, సుజనాచౌదరి, శ్రీరాం మాల్యాద్రి, బుట్టా రేణుక, మురళీమోహన్‌, మాగంటి బాబు, ఎస్పీవై రెడ్డి సహా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu