HomeTelugu Newsకొరటాల శివ పుట్టినరోజు

కొరటాల శివ పుట్టినరోజు

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు రెండు సూపర్‌ డూపర్‌ హిట్‌లను అందించిన దర్శకుడు కొరటాల శివ. ఈరోజు(శుక్రవారం) కొరటాల శివ పుట్టినరోజు. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు కొరటాల శివకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు కూడా ట్విటర్‌ ద్వారా కొరటాల శివకు శుభాకాంక్షలు తెలియజేశాడు. కమర్షియల్ హంగులతో సామాజిక అంశాలు ప్రస్తావిస్తూ సినిమాలు తీయడంలో కొరటాలకు మంచి పట్టుంది. ఈ విషయం భరత్ అనే నేను, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు సినిమాలతో నిరూపించాడు.

4 14తన కెరీర్లో మైలురాయిలాంటి సినిమాను అందించిన కొరటాలకు మహేష్ బాబు శుభాకాంక్షలు తెలుపుతూ ‘నా ప్రియమిత్రుడు, గొప్ప దర్శకుడు కొరటాల శివగారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉంటూ మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. మీపై గౌరవం ఎప్పటికీ తగ్గదు.’ అంటూ మహేష్‌ ట్వీట్ చేశాడు. అలాగే భరత్ అనే నేను మూవీలో ప్రెస్‌మీట్ సన్నివేశానికి ప్రేక్షకులు కొట్టిన చప్పట్లు, ప్రశంసలు మీకే అంకితమిస్తున్నాను అన్నారు. మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu