Homeతెలుగు Newsచంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమా?

చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమా?

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప‍్రభుత్వం సీఐడీకి అప్పగించడాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఆ దోపిడీ కేసును సీఐడీకి అప్పగించడం కచ్చితంగా వాస్తవాలను కప్పిపుచ్చడం కోసమేనని మండిపడ్డారు. ఈ మేరకు ట్వీటర్‌ వేదికగా లేఖ రాసిన జగన్‌.. అసలైన దోషులను రక్షించేందుకు చంద్రబాబు తన చేతిలో దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించి పెద్ద తప్పును చిన్నతప్పుగా చూపించే ప్రయత‍్నం చేస్తున్నారన్నారు. శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా 2014 నుంచి కోటి మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని దోపిడీ చేసినట్లు తేలుతోందన‍్నారు.

10 14

‘ప్రతీరోజూ కొన్ని వేల లారీలను ఉపయోగించి ఖనిజాన్ని తరలించేశారు. ఇంత వ్యవహారం నడుస్తుంటే ఇన్నాళ్లుగా ఈ విషయం ఎవ‍్వరికీ తెలియదని అనుకోవాలా?. ఎమ్మెల్యే నుంచి చినబాబు, పెదబాబు వరకూ ఈ దోపిడీల్లో భాగస్వాములు కాకుంటే ఇది జరిగేదా?. రాష్ట్రంలో జరుగుతున్న ఏ సహజ వనరులను మిగల్చలేదు. చంద్రబాబు తన చేతిలో ఉన్న సీఐడీతో విచారణ చేయిస్తే ఏం జరుగుతుంది?. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను నల్లధనంతో కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన తర్వాత చంద్రబాబు అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. మీకూ ఏసీబీ ఉంది. మాకూ ఏసీబీ ఉంది. మీకూ సీఐడీ ఉంది.. మాకు సీఐడీ ఉంది. మీకూ డీజీపీ ఉన్నాడు. మాకూ డీజీపీ ఉన్నాడు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయాన్ని జగన్‌ ప్రస్తావించారు.

సీఐడీ తన చేతిలో ఉన్న సంస్థ అని చంద్రబాబు చెప్పకనే చెప్పారని జగన్‌ పేర్కొన్నారు. పల్నాడు గనుల దోపిడీ వ్యవహారంలో అలాంటి వ్యక్తి సీఐడీ చేత దర్యాప్తు చేయించడం అపహాస్యం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని సీబీఐ లాంటి ఏజెన్సీతో గనుల వ్యవహారంపై విచారణ జరిపించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. అప్పుడే నిజా నిజాలు బయటకు వస్తాయిని, ఎమ్మెల్యే దగ్గర నుంచి చినబాబు, పెదబాబు వరకూ పేర్లు బయటకు వస్తాయన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!