‘2 .0’ రైట్స్‌ ను దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ!

సూపర్‌ స్టార్‌ రజినికాంత్‌, ప్రముఖ దర్శకుడు శంకర్‌ల భారీ బడ్జెట్ చిత్రం ‘2 పాయింట్ 0’ భారీ స్థాయిలో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలోనే కాకుండా తెలుగునాట కూడ ఈ సినిమా పట్ల సూపర్ క్రేజ్ ఉంది. అందుకే ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ నిర్మాణ సంస్థ ఎన్వీఆర్ సినిమాస్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని దక్కించుకుంది.

ఆంద్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఈ సంస్థే సినిమాను పంపిణీ చేయనుంది. నవంబర్ 29న విడుదలవుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ సంస్థ హెవీ బడ్జెట్ కేటాయించి అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించింది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌ పాత్రను పోషించడం జరిగింది. అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుంది.