HomeTelugu Newsటాక్సీవాలాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌

టాక్సీవాలాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌

విజ‌య్ దేవ‌రకొండ హీరోగా తెర‌కెక్కుతున్న మ‌రో చిత్రం టాక్సీవాలా. జీఎ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేష‌న్స్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా తో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ చిత్రంతో ఎస్ కె ఎన్ నిర్మాతగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న ఇమేజ్ ను దృష్టి లో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌లే విడుద‌లై మంచి ఆదరణ పొందింది.

5 3
ప్రస్తుతం టాక్సీవాలా చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని ప్రోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ పనిలో ఉంది. ఈ సినిమాని జూన్ 2వ వారంలో విడుదల చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్లో ఈచిత్రం మ‌రో మైలురాయి కానుంది. విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని టాక్సీవాలాలో క్యారెక్ట‌ర్ ను ద‌ర్శ‌కుడు రాహుల్ అద్భుతంగా తీర్చిదిద్దినట్లు నిర్మాత తెలిపారు. అన్నీ వ‌ర్గాలను ఆక‌ట్టుకునేలా వుంటుందన్నారు. బాడీ లాంగ్వేజ్, క్యారెక్ట‌రైజేష‌న్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేవిధంగా ఉంటుందని, సుజిత్ విజువ‌ల్స్, కృష్ణ‌కాంత్ లిరిక్స్, జేక్స్ మ్యూజిక్, జాషువా స్టంట్స్ ఈ సినిమాలో హైలైట్స్ గా నిల‌వ‌నున్నాయన్నారు. ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రంలో ర‌వి ప్ర‌కాష్, ఉత్తేజ్, విష్ణు, క‌ళ్యాణి మొద‌లైన‌వారు న‌టిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu