నాగచైతన్య ‘సవ్య సాచి’!

savya-sachiఅక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో చందు మొండేటి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ‘సవ్య సాచి’ అనే టైటిల్ ను ఖరారు చేసింది. సవ్యసాచి అంటే రెండు చేతులతో అస్త్రాలను ప్రయోగించగలిగే వాడని అర్ధం. దానికి తగ్గట్లుగానే ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిజైన్ చేశారు. ఇందులో నాగచైతన్య వెనక్కి తిరిగి నిలబడి చేతిలో ఆయుధాలు పట్టుకొని ఉండడం చూస్తుంటే ఇదొక యాక్షన్ సినిమా అని తెలుస్తోంది.

సెప్టెంబర్ నెల నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. చందు మొండేటి కార్తికేయ, ప్రేమమ్ చిత్రాలతో విజయాలను అందుకొని ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మించనున్నారు. ప్రస్తుతం చైతు నటించిన ‘యుద్ధం శరణం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.