HomeTelugu Reviewsతేజ్‌ ఐ లవ్‌ యు మూవీ రివ్యూ

తేజ్‌ ఐ లవ్‌ యు మూవీ రివ్యూ

 

సినిమా : తేజ్‌ ఐ లవ్‌ యు
నటీనటులు : సాయి ధరమ్‌ తేజ్‌, అనుపమా పరమేశ్వరన్‌, జయ ప్రకాష్‌, పవిత్రా లోకేష్‌, అనీష్‌ కురివిల్లా
దర్శకత్వం : కరుణాకరన్‌
నిర్మాతలు : కేయస్‌ రామారావు
సంగీతం : గోపీ సుందర్

2 a

మెగా మేనల్లుడుగా పరిచయమైనప్పటికీ సాయి ధరమ్‌ తేజ్‌ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తేచ్చునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తన కెరీర్‌ మొదట్లో కొన్ని విజయాలను అందుకున్న తేజ్‌ తరువాత అపజాయలను చవిచూశాడు. మాస్‌ ఇమేజ్‌ కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో..ఈ సారి తేజ్‌ ఐ లవ్‌ యు అంటూ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిప్రేమ, డార్లింగ్‌ లాంటి లవ్ స్టోరిలను తెరకెక్కించిన కరుణాకరన్‌ దర్శకత్వంలో లవర్‌బాయ్‌గా మేపించే ప్రయత్నం చేశాడు. కరుణాకరణ కెరీర్‌కు కూడా ఈ సినిమా కీలకం కావటంతో రిజల్ట్‌ మీద ఆసక్తి నెలకొంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుంది, వీరి కెరీర్‌కు బ్రేక్‌ ఇస్తుందా?

2 9

కథ: ఈ సినిమాలో హీరో తేజ్‌ (సాయి ధరమ్‌ తేజ్‌) బాల్యంలోనే తల్లిదండ్రలుకు దూరం అవ్యడంతో పెద్దమ్మ (పవిత్రా లోకేష్‌) పెదనాన్న (జయ ప్రకాష్‌), పిన్నీ బాబాయ్‌లు గారభంగా చూసుకుంటుంటారు. కుటుంబా సభ్యుల ప్రేమానురాల పొందే తేజ్‌ పదేళ్ల వయస్సులో ఓ మహిళను కాపాడే ప్రయత్నంలో హత్యచేసి జైలుకెళతాడు. 7 సంవత్సరలు శిక్ష తరువాత ఇంటికి వచ్చిన తేజ్‌ను ఆ కుటుంబం మరింత ప్రమేగా చూసుకుంటుంది. తేజ్‌ ప్రతీ పుట్టిన రోజును పెద్ద పండగలా చేసుకుంటుంది. కానీ ఓ సంఘటన మూలంగా తేజ్‌ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు.

ఇలా బయటకు వచ్చేసిన హీరో హైదరాబాద్‌లోని బాబాయ్‌ (పృథ్వీ) ఇంట్లో ఉంటూ మ్యూజిక్‌ బృందంలో పనిచేస్తుంటాడు. ఈ సమయంలోనే ఓ కుర్రాడి అడ్రస్‌ కోసం వెతుకుతూ లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన నందిని (అనుపమా)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు మన హీరో. నందిని కూడా తేజ్‌తో ప్రేమలో పడుతుంది. కానీ తేజ్‌కు తన ప్రేమను వ్యక్తపరిచాలనుకునే సమయంలో ఓ యాక్సిడెంట్‌లో నందిని గతం మర్చిపోతుంది. నందినికి తిరిగి గతం గుర్తుకు వస్తుందా, తను ఎవరికోసం లండన్‌ నుంచి ఇండియాకు వచ్చింది .తేజ్‌, నందిని ఒక్కటయ్యారా.. అనేది కథలోని అంశం.

నటీనటులు: సాయి ధరమ్‌ తేజ్‌ ఇన్నాళ్లు మాస్‌ యాక్షన్‌ పాత్రల్లో మెప్పించి మొదటిసారిగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్లో నటించాడు.తన ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌, కామెడీ టైమింగ్‌తో ఎప్పటిలానే ప్రేక్షకులను మెప్పించాడు. నటన పరంగా ఆకట్టుకున్నా లుక్స్‌ పరంగా ఇంకాస్త దృష్టి పెట్ట ఉంటే బాగుండేది. తెర మీద తేజ్‌ కొంచెం బొద్దుగా కనిపించాడు. అంతేకాక అన్ని సినిమాలు మదిరిగానే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాల్లో చిరంజీవి, పవన్‌ కల్యాణ్ లను ఇమిటేట్‌ చేసే ప్రయత్నం చేశాడు. హీరోయిన్‌ నందిని పాత్రలో అనుపమా పరమేశ్వరణ్ బాగా నటించారు. తనకున్న హోమ్లీ ఇమేజ్‌ను పక్కన పెట్టి మోడ్రన్‌ లుక్‌లోనూ అదరగొట్టింది. జయప్రకాష్‌, పవిత్రా లోకేష్‌ల నటన మనసుకు హత్తుకున్నేల ఉంది. 30 ఇయర్స్‌ పృథ్వీ, వైవా హర్షలు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.

విశ్లేషణ: తొలిప్రేమ, డార్లింగ్‌ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న కరుణాకరన్‌ ఇటీవల అంతటి విజయాని అందుకులేకపోయాడు. కరుణాకరన్ సినిమా అంటే యూత్‌ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంటుంది. ఈసారి కొంచెం విరామం తీసుకొని ఓ ఫ్యామిలీ, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే కరుణాకరన్‌ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. తన హిట్‌ చిత్రాల స్థాయిలో ఎమోషన్స్‌ను పండంచలేకపోయాడు. చాలా చోట్ల కరుణాకరన్‌ గత చిత్రల ఛాయలు కనిపించటం కూడా ఇబ్బంది పెడుతుంది. కథ పరంగా బలమైన ఎమోషన్స్‌ చూపించే అవకాశం ఉన్నా.. సాదాసీదా కథనంతో నడిపించేశాడు దర్శకుడు. ఫస్ట్‌ హాఫ్‌ మొత్తంలో ప్రేక్షకుడ్ని కథలో లీనం చేసే స్థాయి ఎమోషనల్‌ సీన్‌ ఒక్కటి కూడా లేకపోవటం నిరాశపరుస్తుంది. అక్కడక్కడా కామెడీ వర్క్‌ అవుట్‌ అయినా.. సినిమాను నిలబెట్టే స్థాయిలో మాత్రం లేదు. రొమంటిక్‌ ఎంటర్‌టైనర్‌కు సంగీతం చాలా ఇంపార్టెంట్‌ కానీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపిసుందర్‌ పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ నిరాశపరిచాడు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా రేంజ్‌క తగ్గటుగానే ఉన్నాయి.

ఫ్యామిలీ ఎమోషన్స్‌
కొన్ని కామెడీ సీన్స్‌
హీరోయిన్‌ పాత్ర

హైలైట్స్
హీరో, హీరోయిన్‌
నిర్మాణ విలువలు
కొన్ని కామెడీ సీన్స్‌

డ్రాబ్యాక్స్
కథలో కొత్తదనం లేకపోవడం
మ్యూజిక్‌
చివరిగా : ‘తేజ్‌’ ప్రేమకథను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

  సినిమా : తేజ్‌ ఐ లవ్‌ యు నటీనటులు : సాయి ధరమ్‌ తేజ్‌, అనుపమా పరమేశ్వరన్‌, జయ ప్రకాష్‌, పవిత్రా లోకేష్‌, అనీష్‌ కురివిల్లా దర్శకత్వం : కరుణాకరన్‌ నిర్మాతలు : కేయస్‌ రామారావు సంగీతం : గోపీ సుందర్ మెగా మేనల్లుడుగా పరిచయమైనప్పటికీ సాయి ధరమ్‌ తేజ్‌ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తేచ్చునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తన కెరీర్‌ మొదట్లో కొన్ని విజయాలను అందుకున్న తేజ్‌...తేజ్‌ ఐ లవ్‌ యు మూవీ రివ్యూ