కోస్టల్ బ్యాంక్ ఎండీ జయరామ్ హత్య కేసు మరో మలుపు


ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఎండీ జయరామ్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. శిఖా చౌదరి పాత్ర లేదని ఏపీ పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే. తనపై అనుమానాలు ఉన్నాయని జయరామ్ భార్య పద్మశ్రీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర తేల్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెను నిందితురాలిగా చేర్చాలని కోరారు. జయరామ్ హత్య హైదరాబాద్ లోనే జరిగిందని.. కావున హైదరాబాద్ పోలీసులే విచారణ జరపాలని డిమాండ్ చేసింది. నా భర్తను క్రూరంగా హత్య చేశారు.. ఈ హత్య నా జీవితాన్ని కుంగదీసిందన్న ఆమె.. నా కుమారుడు తండ్రి లేనివాడయ్యాడు. నాకు న్యాయం చేయాలని కోరారు. జయరాం హత్య కేసులో మరిన్ని కుట్రకోణాలున్నాయనే అనుమానాలు వ్యక్తం చేసిన పద్మశ్రీ.. ఏపీ పోలీసులను శిఖాచౌదరి ప్రభావితం చేసి ఉండొచ్చనే అనుమానాలను కూడా ఆమె వ్యక్తం చేశారు. శిఖాచౌదరి డబ్బులు, ఆస్తులపై వ్యామోహం ఎక్కువని.. రాకేష్ వ్యవహారం, శిఖాచౌదరి పాత్రను తేల్చాలని డిమాండ్ చేశారు.