HomeTelugu Newsనా సర్వస్వం నువ్వే: సోనాలి

నా సర్వస్వం నువ్వే: సోనాలి

ప్రముఖ నటి సోనాలి బింద్రే కుమారుడు ఈ రోజు (శనివారం) 13వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న సోనాలి ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఇండియాలో ఉన్న కుమారుడ్ని కలవలేని ఆమె భావోద్వేగంతో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. తొలిసారి తన ముద్దుల కుమారుడి పుట్టినరోజున అతడి పక్కనలేనని తెలిపింది . దీంతోపాటు ప్రత్యేక వీడియోను కూడా పోస్ట్‌ చేసింది.

4 9

‘రణ్‌వీర్‌.. నా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం.. నేను కాస్త ఎక్కువ భావోద్వేగానికి‌ గురవుతున్నానేమో. అయినా సరే.. నీ 13వ పుట్టినరోజుకు ఆ అర్హత ఉంది. వావ్‌.. ఇప్పుడు నువ్వు టీనేజర్‌వి. ఆ నిజాన్ని నమ్మడానికి నాకు కాస్త సమయం పడుతుంది. నీ మానవత్వం, బలం, దయ పట్ల నేను ఎంత గర్వంగా ఉన్నానో చెప్పలేను. నా బుజ్జి కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మనం కలిసి ఉండలేకపోయిన తొలి పుట్టినరోజు ఇది. నిన్ను చాలా మిస్‌ అవుతున్నా. నీకు నా అమితమైన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది..’ అని సోనాలి పోస్ట్‌లో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!