దయచేసి నన్ను ఫాలో అవ్వకండి: విజయ్‌

తమిళనాడులో రజనీ తరువాత అంతటి అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న హీరో విజయ్‌. ఇళయ దళపతిగా ఈ హీరోను ఫ్యాన్స్‌ ఆరాధిస్తుంటారు. ప్రస్తుతం తమిళ బాక్సాఫీస్‌ కింగ్‌గా దూసుకుపోతున్నారు. తన సినిమాలతో ఈజీగా వంద కోట్లను కలెక్ట్‌ చేసేస్తూ.. రికార్డులు సృష్టిస్తున్నారు. తేరి, మెర్సెల్‌, సర్కార్‌ లాంటి చిత్రాలతో దూకుడు మీదున్న ఈ హీరో ప్రస్తుతం తన తదుపరి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

విజయ్‌ తన మూవీ షూటింగ్‌ కోసం వెళ్తుండగా.. ఓ ఇద్దరు అభిమానులు వెంబడించారు. తన డ్రైవర్‌కారు వేగాన్ని పెంచినా.. అభిమానులు మాత్రం వదలకుండా వారు కూడా అంతే వేగంతో వెనకే వస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన విజయ్‌.. కారు వేగాన్ని తగ్గించమని చెప్పి.. తన అభిమానులకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారట. ‘ఇంత వేగంగా వెళ్లడం, ఇలా ఫాలో అవ్వడం అంత మంచి కాదు. ప్రమాదం జరగే అవకాశం ఉంటుంది. నన్ను ఇలా ఫాలో కావొద్దంటూ” వారికి సూచించాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. తేరి, మెర్సెల్‌ లాంటి బ్లాక్‌ బస్టర్స్‌ తరువాత హ్యాట్రిక్‌ కొట్టేందుకు అట్లీ దర్శకత్వంలో విజయ్‌ తన ప్రాజెక్ట్‌ను చకాచకా పూర్తి చేసేస్తున్నారు.