HomeTelugu Newsపోలవరం ఇక మేఘా పరుగులు

పోలవరం ఇక మేఘా పరుగులు

మేఘా ఇంజనీరింగ్‌ పోలవరాన్ని ఇక పరుగులు పెట్టించనుంది.రెండేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి తన శర్వశక్తులు ఒడ్డనుంది.దేశంలో క్లిష్టమైన ప్రాజెక్ట్‌లను నిర్ణీత గడువులోగా నాణ్యతాప్రమాణాలతో పూర్తిచేస్తూ రికార్డులు సాధిస్తున్న మేఘా ఇప్పుడుపోలవరాన్ని కూడా లక్ష్యం మేరకు నిర్మించేందుకు తన ఇంజనీరింగ్‌నైపుణ్యంతో పనులు ప్రారంభించింది. కాళేశ్వరం లాంటి క్లిష్టమైనప్రాజెక్ట్‌లు నిర్మించిన అనుభవంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ జాతీయప్రాజెక్ట్‌ అయిన పోలవరాన్ని ఒప్పంద గడువు ప్రకారం పూర్తి చేసిరాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. ఇన్ని రోజులుపోలవరం పనులు చేపట్టేందుకు అడ్డంకిగా ఉన్న స్టేను హైకోర్టుఎత్తివేయడంతో పనులు చేయడానికి మార్గం సుగమం అయ్యింది.ఈ ప్రాజెక్టును కాళేశ్వరం తరహాలో యుద్ధ ప్రాతిపదికనపూర్తిచేయాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతో ఉన్నారు.అందువల్లనే గత ప్రభుత్వంలో నత్తనడకన పనులు చేయడం వల్ల వాటిని రద్దు చేసి మొత్తం ఒకేపనిగా టెండరును పిలిచారు. రెండేళ్లలో మొత్తం ప్రాజెక్టు పూర్తికావాలనేది జగన్ ఆకాంక్ష, లక్ష్యం.ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2005లో పనులు ప్రారంభిస్తూ హెడ్వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనులను ప్యాకేజ్ వారిగా అప్పగించారు. అదేసమయంలో ఆయన కీలకమైన అన్ని అనుమతులను సాధించారు.

శుక్రవారం నవంబర్ 1 న స్పిల్‌ వే బ్లాక్‌ నంబర్‌ 18 వద్ద మేఘాఇంజనీరింగ్‌ సంస్థ డిజిఎం ఎ. వెంకట సతీష్‌, మేనేజర్‌ పమ్మీమురళి, జలవనరుల శాఖ ఈఈ ఏసుబాబు సమక్షంలో భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఈలుశేఖర్‌బాబు, మళ్లీఖార్జున్‌, సుధాకర్‌బాబు, పాండురంగయ్య, డిఈలు రామేశ్వర్‌నాయుడు, బాలకృష్ణ, లక్ష్మణ్‌, ఏసుదాసు, యశోధరావు, శ్రీనివాస్‌, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

polavaram MEGHA

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ పనును రద్దు చేసిరివర్స్‌ టెండర్కు వెళ్లి, పోలవరం హెడ్వర్క్స్తో తో పాటు జల విద్యుత్‌కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్‌ టెండర్‌ పిలిచింది. ఈ టెండర్లోమేఘా ఇంజనీరింగ్‌ గతంలో పనులు చేపట్టిన సంస్థల కంటే తక్కువశాతంకు -12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకుముందుకు వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి 628 మొత్తంలో నిధులు ఆదా అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో జల విద్యుత్‌ కేంద్రంతో పాటుప్రధాన కాంక్రీట్‌ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్‌పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్‌ ఒక్కటే 4358 మొత్తానికిటెండర్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ధేశించినగడువులోగా ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాలనేకృతనిశ్చయంతో వడివడిగా అడుగులు వేస్తోంది ఎంఇఐఎల్ . పోలవరం ప్రాజెక్టును 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, 80 టీఎంసీల గోదావరి జలాలనుప్రకాశం బ్యారేజ్‌ ఎగువన కృష్ణా నదికి తరలించటం, కృష్ణ-గోదావరిడెల్టాలోని రెండు పంటలకు నీరందిచేలా ఆయకట్టు స్థిరీకరణతోపాటు 23.44 టీఎంసీల నీటిని విశాఖపట్నం నగర తాగునీటిఅవసరాల నిమిత్తం తరలించటం, పోలవరం కాలువకు అనుకునిఉన్న 540 గ్రామాల్లోని 28.5 క్ష మంది ప్రజల దాహార్తిని తీర్చేందుకునిర్మిస్తున్నారు.

సర్వే, వనరుల సమీకరణ ముఖ్యంగా ఇంజనీరింగ్‌ యంత్రాంగం, యంత్ర సామాగ్రితో పాటు అవసరమైన ముడిసరుకు తదితరపనులను మేఘా ఇప్పటికే చురుగ్గా చేపట్టింది. వరదలు దాదాపునిలిచిపోవడంతో పనులు ప్రారంభించడం కూడా సులభంకానుంది. ఓ వైపు ప్రధాన రిజర్వాయర్‌ పనులు, మరోవైపు జలవిద్యుత్‌ కేంద్రం పనులు ఏకకాలంలో చేపడుతోంది. గతంలో ప్రధానజలాశయం పనులు కొంతమేర జరిగినప్పటికీ జల విద్యుత్‌ కేంద్రంపనులు మాత్రం ఏమాత్రం ముందుకు సాగలేదు. ప్రారంభదశలోనేఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu