తెలంగాణ కొత్త మంత్రులు – శాఖలు

ఈరోజు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. రాజ్ భవన్‌లో ఆరుగురు కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి, గంగుల కమలాకర్, పువ్వాడలు కొత్త మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసిన ఆరుగురు మంత్రులకు శాఖలను కేటాయించారు.

హరీష్ రావు – ఆర్ధికశాఖ
కేటీఆర్ – మున్సిపల్, ఐటి, మైనింగ్, పరిశ్రమల శాఖలు
సబితా ఇంద్రారెడ్డి – విద్యాశాఖ
గంగుల కమలాకర్ – పౌరసరఫరాలు, బీసీ సంక్షేమం,
సత్యవతి రాథోడ్ – గిరిజన, మహిళా, శిశుసంక్షేమం
పువ్వాడ అజయ్ కుమార్ – రవాణాశాఖ