HomeTelugu Big Stories'ఫిదా' రిలీజ్ డేట్ కన్ఫర్మ్!

‘ఫిదా’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్!

‘ముకుంద‌’, ‘కంచె’ వంటి విల‌క్ష‌ణ చిత్రాల‌తో మెప్పించిన మెగా హీరో వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘ఫిదా’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. శ‌క్తికాంత్ సంగీత సారథ్యంలో విడుద‌లైన పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుమైన స్పంద‌న వ‌చ్చింది. జూలై 10న పాట‌ల‌ను విడుద‌ల చేస్తారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమాను జూలై 21న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి స‌హ నిర్మాతః హ‌ర్షిత్‌, నిర్మాత‌లుః దిల్‌రాజు, శిరీష్‌, ద‌ర్శ‌కత్వంః శేఖ‌ర్ క‌మ్ముల‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu