బిగ్ బాస్ 3 హోస్ట్ గా మన్మధుడు.. కేఏ పాల్‌, రేణు దేశాయ్‌

తెలుగు బిగ్ బాస్ సీజ‌న్ -3 ఎలాగైనా ఈ జూన్, జులైలో మూడో సీజ‌న్ మొద‌లు పెట్టాల‌ని చూస్తుంది మా యాజ‌మాన్యం. ఈ సీజ‌న్ కోసం ఇద్ద‌రు ముగ్గురు హీరోల‌ను అనుకున్న నిర్వాహ‌కులు.. చివ‌రికి నాగార్జున‌కు ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే మిగిలిన భాష‌ల్లో బిగ్ బాస్ 3 మొద‌లైంది కూడా.

దాంతో తెలుగులో కూడా వీలైనంత త్వ‌ర‌గా సీజ‌న్ మొద‌లు పెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్, నానితో పాటు వెంక‌టేష్ కూడా మూడో సీజ‌న్ హోస్ట్ లిస్టులో ఉన్నాడు. కానీ ఎవ‌రూ క‌న్ఫ‌ర్మ్ కాలేదు. చివ‌రికి నాగార్జున ఈ సీజ‌న్ టేకోవ‌ర్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. దీనికోసం నాగ్ కూడా భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. ఇప్ప‌టికే అన్నీ సిద్ధం చేసుకుని జులై లేదంటే సెప్టెంబ‌ర్ నుంచి మూడో సీజ‌న్ ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షోలో పాల్గొన‌బోయే హౌజ్ మేట్స్ గురించే చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్ప‌టికే చాలా మంది పేర్లు వినిపించినా కూడా ఓ ఇద్ద‌రు సంచ‌ల‌న తార‌ల పేర్లు మాత్రం ఇప్పుడు ఆస‌క్తి రేపుతున్నాయి. తెలుగు రాజ‌కీయాల్లో ఎవ‌ర్ గ్రీన్ కామెడీ స్టార్ కేఏ పాల్‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఈ సారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. వాళ్లిద్ద‌రూ కానీ వెళ్లారంటే తొలి రెండు సీజ‌న్స్ కంటే కూడా మూడో సీజ‌న్ మ‌రింత హైలైట్ కావ‌డం ఖాయం. వాళ్ళ‌తో పాటు మ‌రికొంద‌రు స్టార్స్‌ను ఈ సారి ఇంట్లోకి పంపించాల‌ని చూస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?