HomeTelugu Big StoriesOTT Releases This Week: సందడి చేయనున్న 21 సినిమాలు.. ఆ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా!

OTT Releases This Week: సందడి చేయనున్న 21 సినిమాలు.. ఆ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా!

OTT Releases This Week

OTT Releases This Week: ప్రతి వారం కొత్త సినిమాలు లవర్స్‌ను ఊరిస్తుంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల తేదీ దగ్గరపడటం వల్ల చెప్పుకోదగ్గ సినిమాలేమీ థియేటర్లలో రావట్లేదు. మరోవైపు ఐపీఎల్ కూడా జోరుగా సాగుతోంది. ఓవైపు ఓటీటీలు, మరోవైపు ఐపీఎల్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ పంచుతున్నాయి. ఇక ఎప్పటిలాగే ఈ వారంలో విడుదలయ్యే ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసుల గురించి తెలుసుకుందాం..ఈ వారం.. మే 6 నుంచి మే 12వ తేది వరకు ఓటీటీలోకి వెబ్ సిరీస్‌, సినిమాలు కలుపుకుని మొత్తం 21 స్ట్రీమింగ్‌ కానున్నాయి.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఆవేశం (తెలుగు డబ్బింగ్ చిత్రం)- మే 9
మ్యాక్స్‌టన్ హాల్ (జర్మనీ వెబ్ సిరీస్)-మే 9
ది గోట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 9

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ చిత్రం)- మే 6
మదర్ ఆఫ్ ది బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ)- మే 9
బోడ్కిన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 9
థ్యాంక్యూ నెక్ట్స్ (టర్కిష్ వెబ్ సిరీస్)- మే 9
లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 10

ఆహా ఓటీటీ
గీతాంజలి మళ్లీ వచ్చింది (తెలుగు హారర్ కామెడీ సినిమా)- మే 8
రోమియో (తమిళ సినిమా)- ఆహా తమిళ్- మే 10

జీ5 ఓటీటీ
8 ఏఎమ్ మెట్రో (హిందీ చిత్రం)- మే 10
పాష్ బాలిష్ (బెంగాలీ వెబ్ సిరీస్)- మే 10

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ
ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 8
ఆడు జీవితం (మలయాళ డబ్బింగ్ సినిమా)- మే 10 (రూమర్ డేట్)

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ
డార్క్ మేటర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 8
హాలీవుడ్ కెన్ క్వీన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 8
చిత్రం చూడరా (తెలుగు సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- మే 9
మర్డర్ ఇన్ మహిమ్ (హిందీ వెబ్ సిరీస్)- జియో సినిమా ఓటీటీ- మే 10
ఉందేకి సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- మే 10
ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే- మే 10
ఫ్యూచర్ పొండాటి (తమిళ వెబ్ సిరీస్)- సన్ నెక్ట్స్ ఓటీటీ- మే 10

ఇలా ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల కానున్నాయి. వాటిలో హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన గీతాంజళి మళ్లీ వచ్చింది, మలయాళంలో వంద కోట్ల వరకు కలెక్షన్స్ కొల్లగొట్టిన ఫహాద్ ఫాజిల్ ఆవేశం సినిమా, వరుణ్ సందేష్ నటించిన చిత్రం చూడరా మూవీతోపాటు మలయాళ బ్లాక్ బస్టర్ ఆడు జీవితం వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు బాగా స్పెషల్ కానున్నాయి.

వీటితోపాటు తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ రోమియో, మర్డర్ ఇన్ మహిమ్ హిందీ వెబ్ సిరీస్, మల్లేశం సినిమా డైరెక్టర్ తెరకెక్కించిన 8 ఏఎమ్ మెట్రో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇలా ఆరు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో 7 స్పెషల్‌గా ఉండనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu