HomeTelugu Newsబన్నీ కెలుకుడు ఎక్కువైందా..?

బన్నీ కెలుకుడు ఎక్కువైందా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. మెగా ఫ్యామిలీ అనే బ్రాండ్ తో కాకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సృష్టించుకున్నాడు. తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా బన్నీకు మంచి క్రేజ్ ఉంది. తన సినిమాలను కేరళలో విడుదల చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. ప్రస్తుతం వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు. వరుస సినిమాలు హిట్ కొడుతున్నాడన్న కాన్ఫిడెన్సో లేక మరేదో కాని ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న నా పేరు సూర్య సినిమాలో బన్ని వేలు పెట్టుడు ఎక్కువైందని టాక్. bunny
దర్శకుడి ఆలోచనలు ప్రతి ఒక్కటి అడ్డు పడుతున్నాడట. ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. సినిమాలో లవ్ సీన్స్ కత్తెరవేస్తూ బన్ని ఎడిటింగ్ టిప్స్ చెప్పాడట. కంటెంట్ మిస్ అవ్వకూడదని లవ్ సీన్స్ తగ్గినా పర్వాలేదని చెప్పాడట. అయితే వంశీ మాత్రం అందుకు నిరాకరించాడని ఇద్దరి మధ్య ఈ విషయంపై గొడవ జరిగిందని అంటున్నారు. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!