HomeTelugu Newsమహేశ్‌ 25వ చిత్రం టైటిల్‌ ఫిక్స్‌?

మహేశ్‌ 25వ చిత్రం టైటిల్‌ ఫిక్స్‌?

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఇటీవలే నటించిన భరత్‌ అనే నేను సినిమాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం సిదద్ధమవుతున్నారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనున్న ఈ చిత్రంలో మహేశ్‌ బాబు డిఫరెంట్‌ లుక్‌తో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది.

1 8 2

మహేశ్‌ తన 25 వ చిత్రం కోసం సెట్స్‌ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో దర్శకుడు వంశీ పైడిపల్లి బిజీగా ఉన్నాడు. మహేశ్‌ బాబు కెరియర్లో సంఖ్యా పరంగా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకోవడంతో, వంశీ పైడిపల్లి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. మహేశ్‌ బాబు అభిమానులకి పూర్తిస్థాయిలో సంతృప్తిని కలిగించేలా ఆయన ఈ సినిమా కథను తీర్చిదిద్దాడని అంటున్నారు. ఈ సినిమా కోసం ‘రాజసం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోందని తెలుస్తోంది. ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి. ఈ సినిమాలో మహేశ్‌ బాబు సరసన కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. పూజా హెగ్డే మంచి హైట్‌ కావడంతో తెరపై ఈ జంట కనువిందు చేయడం ఖాయమనేది అభిమానుల మాట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu