HomeTelugu Newsమహేష్ తల్లిగా జయప్రద

మహేష్ తల్లిగా జయప్రద

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రం మహేష్ బాబుకి 25వ సినిమా కూడా కావటంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే అమెరికా వెళ్లనున్నది.

9 19

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్‌లో వినిపిస్తోంది. భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మహేష్ తల్లిగా సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ జయప్రద నటిస్తున్నారు. తల్లిగా జయప్రద కీలకమైన రోల్ ప్లే చేస్తుందని తెలుస్తున్నది. కాగా ఈ సినిమాలో మహేష్‌ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా యువ కథానాయకుడు అల్లరి నరేష్‌ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో మహేష్‌ కొత్త లుక్‌తో కనిపించనున్నాడు.

9a 4

Recent Articles English

Gallery

Recent Articles Telugu