కంగనా ఓ మెంటల్‌ కేస్‌: సంజయ్ రౌత్


బాలీవుడ్ నటి కంగనా రనౌత్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కంగనా గురించి సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఆమె ఒక మెంటల్ కేసు అని అన్నారు.

కంగనా తిన్న పళ్లెంలోనే ఉమ్మేసే రకం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కంగనాను తాము బెదిరించామని చెప్పుకుంటోందని… తాము ఎవరినీ బెదిరించమని అన్నారు. ముంబైని పీఓకేతో పోల్చే వారికి పీఓకే గురించి ఏమీ తెలియదని చెప్పారు. ముంబైని కానీ, మహారాష్ట్రను కానీ కించపరుస్తూ మాట్లాడితే తాము సహించబోమని అన్నారు. ఆమె వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. 1992లో ముంబై పేలుళ్లు జరిగినప్పుడు నగర పోలీసులు వారి ప్రాణాలను పణంగా పెట్టి జనాల ప్రాణాలను కాపాడారని సంజయ్ చెప్పారు. కరోనా వైరస్ సమయంలో విధులు నిర్వహిస్తూ పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. హీరో సుశాంత్ మరణం కేసు విచారణలో ముంబై పోలీసుల చిత్తశుద్ధిని కించపరుస్తూ కంగనా మాట్లాడుతోందని సంజయ్ దుయ్యబట్టారు.

CLICK HERE!! For the aha Latest Updates