HomeTelugu Newsమ్యూజిక్‌ డే సందర్భంగా డీఎస్పీ దుమ్ములేపేశాడు

మ్యూజిక్‌ డే సందర్భంగా డీఎస్పీ దుమ్ములేపేశాడు

‘నేడు ప్రపంచ సంగీత దినోత్సవం’ ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకులంతా తమదైన స్టైలో స్పందిస్తున్నారు. ఇక టాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భం ఏదైనా కాసింత ప్రత్యేకంగా ఆలోచించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టే డీఎస్పీ ఈ మ్యూజిక్‌ డే నాడు దుమ్ములేపేశాడు.!. తన టీంతో రూపోందించిన 1:25 నిమిషాల నిడివిగల వీడియోను ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

7 13

సంగీతం ప్రతీ చోటా, ప్రతీ వస్తువులో ఉంటుందని డీఎస్పీ ఈ వీడియో ద్వారా రుజువు చేశాడు.! అమెరికాకి వెళ్లి సంగీత ప్రదర్శన ఇచ్చే సమయంలో దేవీ శ్రీ ప్రసాద్‌ టీమ్‌ అందరూ తమ వద్దనున్న సాధారణమైన బల్లలు, బాక్సులు, డబ్బాలు, కుర్చీలు, రాడ్స్‌ లాంటివస్తువులతోటే సంగీతం పుట్టించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ వీడియోను నెట్టింట్లో చూసిన అభిమానులు “డీఎస్పీ సార్‌ దుమ్ములేపేశారు..” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అనేకమంది నెటిజన్లు కూడా ఈ వీడియోకి ‘ఫిదా’ అయ్యారు. పెద్ద ఎత్తున షేర్లు, లైకులు కొట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu