HomeTelugu Newsరాధిక ఆరోగ్యంపై వదంతులే..!

రాధిక ఆరోగ్యంపై వదంతులే..!

సీనియర్ న‌టి రాధిక‌కు కేన్స‌ర్ అంటు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జరుగుతుండటంతో అభిమానుల‌ను ఆందోళ‌న‌కు గురిచేసింది. సినీ ప్ర‌ముఖులు సైతం రాధిక ఆరోగ్యం గురించి ఫోన్ చేసి ఆరాలు తీయ‌డం మొద‌లుపెట్టార‌ట‌. త‌న ఆరోగ్యంపై సొష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారానికి ఫుల్ స్టాఫ్ పెట్టేందుకు న‌టి రాధిక వివ‌ర‌ణ ఇచ్చుకున్నారట.

5 4

త‌నకు ఎలాంటి కేన్స‌ర్ లేద‌ని సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు అబ‌ద్దాలని కొట్టిపారేశారు. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చార‌ల‌తో బ‌తికున్నవారిని కూడా చంపేస్తున్నారు. ముఖ్యంగా సినీ రంగంలో ప్ర‌ముఖుల‌పై ఇలాంటి ప్ర‌చారాలు ఎక్కవగా చోటు చేసుకుంటున్నాయి. రాధికకు బ్లడ్ కేన్సర్ ఉందని అందుకే కొన్నాళ్లుగా ఆమె బయట కనిపించడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంపై నటి రాధిక అసహనాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu