సుధీర్‌ బాబు ట్వీట్ వైరల్‌!!

సుధీర్ బాబు, శ్రియ, నారా రోహిత్, శ్రీ విష్ణులు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ నిన్న (సోమవారం) రిలీజ్‌ అయ్యింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ ట్రైలర్‌లో సుధీర్ బాబు వాయిస్‌ డిఫరెంట్‌గా అనిపించటంతో సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. మీ వాయిస్‌ ఏంటి ఇలా ఉంది అంటూ అభిమానులు సుధీర్‌ను ట్యాగ్‌ చేస్తూ ప్రశ్నలు సంధించారు. ఈ విషయంపై స్పంధించిన సుధీర్‌ బాబు ఆ వాయిస్‌ నాది కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

‘కొన్ని కారణాల వల్ల వీర భోగ వసంత రాయలు సినిమాలో నా పాత్రకు నేను డబ్బింగ్‌ చెప్పలేదు. ఆ కారణాలను ట్వీట్‌లో వివరించడం సాధ్యం కాదు.’ అంటూ ట్వీట్ చేశాడు సుధీర్ బాబు. ట్రైలర్‌లో వినిపించిన వాయిస్‌పై విమర్శలు వస్తున్నాయి. సినిమాలో కూడా సుధీర్ వాయిస్‌ ఇలాగే ఉంటుందా అంటూ పెదవి విరుస్తున్నారు నెటిజన్లు