HomeTelugu Newsరివ్యూ: ఏ మంత్రం వేశావే

రివ్యూ: ఏ మంత్రం వేశావే

నటీనటులు: విజయ్ దేవరకొండ, శివానీ సింగ్ తదితరులు
సంగీతం: అబ్బస్ సమద్
సినిమాటోగ్రఫీ: శివారెడ్డి
ఎడిటర్: ధర్మేంద్ర కాకర్ల
దర్శకత్వం: శ్రీధర్ మర్రి

‘పెళ్లి చూపులు’,’అర్జున్ రెడ్డి’ చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ఏ మంత్రం వేశావే’. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!vijay

కథ:
నిఖిల్(విజయ్ దేవరకొండ) ఎప్పుడూ కూడా వీడియో గేమ్స్ ఆడుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటాడు. తన ప్రవర్తనతో తల్లితండ్రులను బాధ పెడుతుంటాడు. అలాంటిది అతడు సోషల్ మీడియాలో రాగ్స్(శివానీ సింగ్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమెతో స్నేహం చేయాలనుకుంటాడు. తన స్నేహం కావాలంటే ఆమెతో ఒక గేమ్ ఆడాలని షరతు పెడుతుంది రాగ్స్. మరి నిక్కీ ఆ గేమ్ లో గెలుస్తాడా..? అసలు రాగ్స్ ఎవరు..? నిక్కీతోనే ఎందుకు గేమ్ ఆడాలనుకుంటుంది..? అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:
విజయ్ దేవరకొండ
సందేశం

మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
క్లైమాక్స్
హీరోయిన్

విశ్లేషణ:
సోషల్ మీడియా, గాడ్జేట్స్ అనేవి యువతను ఎలా పక్కదారి పట్టిస్తుందో, వాటి కారణంగా బంధాలకు ఎంత దూరంగా బ్రతుకుతున్నారనే అంశాలతో సందేశాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు దర్శకుడు. కానీ అది కాస్త వర్కవుట్ అవ్వలేదు సరికదా ఆడియన్స్ సహనానికి పరీక్షలా మారింది. సరైన కథనం, ఆలోచింపజేసే సన్నివేశాలు లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. క్లైమాక్స్ రొటీన్ గా ఊహాజనితంగా ఉండడంతో ఎలాంటి ఎగ్జైట్మెంట్ కలగదు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాకు దూరంగా ఉంటేనే మంచిది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

నటీనటులు: విజయ్ దేవరకొండ, శివానీ సింగ్ తదితరులు సంగీతం: అబ్బస్ సమద్ సినిమాటోగ్రఫీ: శివారెడ్డి ఎడిటర్: ధర్మేంద్ర కాకర్ల దర్శకత్వం: శ్రీధర్ మర్రి 'పెళ్లి చూపులు','అర్జున్ రెడ్డి' చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'ఏ మంత్రం వేశావే'. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం! కథ: నిఖిల్(విజయ్ దేవరకొండ) ఎప్పుడూ కూడా...రివ్యూ: ఏ మంత్రం వేశావే
error: Content is protected !!