HomeTelugu NewsKangana Ranaut: దయచేసి నాకు ఎలాంటి పాత్రను ఇవ్వకండి.. సందీప్‌ రెడ్డి ఆఫర్‌పై కంగనా రీప్లయ్‌

Kangana Ranaut: దయచేసి నాకు ఎలాంటి పాత్రను ఇవ్వకండి.. సందీప్‌ రెడ్డి ఆఫర్‌పై కంగనా రీప్లయ్‌

Kangana Ranaut responded to 1Kangana Ranaut: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ‘యానిమల్’ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పానసరం లేదు. గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీకి అదిరిపోయే రెస్పాన్స్‌తోపాటు విపరీతమైన నెగెటివిటీ వస్తోంది.

ఈ సినిమాని ఓటీటీలో యానిమల్ మూవీ చూసిన స్టార్ సెలబ్రిటీలు విమర్శిస్తున్నారు. అలా యానిమల్‌ మూవీని తిట్టిన వాళ్లలో బాలీవుడ్ బ్యూటి కంగనా రనౌత్ ఒకరు. అయితే తన సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేసిన కంగనా రనౌత్‌ ఒప్పుకుంటే ఆమెకు స్టోరీ చెబుతానని యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇటీవల చాలా పాజిటివ్‌గా స్పందించాడు.

ఓ ఇంటర్వ్యూలో “కంగనాతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నారా?” అని సందీప్ రెడ్డిని యాంకర్ ప్రశ్నించాడు. “నాకు అవకాశం వస్తే ఆమె ఆ పాత్రకు సరిపోతుందని నాకు అనిపిస్తే నేను వెళ్లి ఆమెకు కథ చెబుతాను. నిజం చెప్పాలంటే జెన్యూన్‌గా ఆమె నటన అంటే నాకు చాలా ఇష్టం” అని కంగనాపై సందీప్ రెడ్డి వంగా కామెంట్స్ చేశాడు.

“కంగనా నటించిన క్వీన్ చూశాను. ఆమె యాక్ట్ చేసిన చాలా సినిమాలు చూశాను. ఆమె యాక్టింగ్ బాగుంటుంది. యానిమల్‌పై ఆమె చేసిన నెగెటివ్ కామెంట్స్‌ గురించి నేను అంతగా పట్టించుకోను. నాకు బాధగా కూడా అనిపించదు” అని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నాడు. అనంతరం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సందీప్ రెడ్డి వంగా ఆన్సర్‌కు వివాదస్పద బ్యూటి కంగనా రనౌత్ మెచ్చుకుంటూనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

“రివ్యూలు, విమర్శలు ఒకటి కాదు. అవి ఒకేలా ఉండవు. ప్రతి కళపై సమీక్ష, చర్చ అనేది జరుగుతుంది. ఇది ఒక సాధారణ విషయం. నా రివ్యూపై సందీప్ గారు నవ్వుతూ గౌరవాన్ని చూపించిన విధానం చాలా గొప్పది. అది అతను మ్యాన్లీగా సినిమాలు తీయడమే కాదు.. అతని యాటిట్యూడ్ కూడా మ్యాన్లీగానే ఉంటుందని చూపిస్తోంది. థ్యాంక్యూ సార్” అని కంగనా రనౌత్ తెలిపుతూ తాజాగా ట్వీట్ చేసింది.

అయితే కంగనా రనౌత్ ఇంకా కొనసాగిస్తూ.. “కానీ, దయచేసి నాకు ఎలాంటి పాత్రను ఇవ్వకండి. లేకపోతే మీ ఆల్ఫా మగ హీరోలు స్త్రీవాదులు అవుతారు. ఆపై మీ సినిమాలు కూడా విజయం సాధించవు. మీరు బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తారు. మీలాంటి వాళ్లు సినిమా పరిశ్రమకు కావాలి. కానీ, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలు స్త్రీద్వేషపూరిత సన్నివేశాలు, డైలాగ్స్ బహిష్కరించబడ్డాయి” అని ఓవైపు సందీప్ రెడ్డిని ప్రశంసిస్తూనే మరోవైపు ఇన్ డైరెక్ట్‌గా చమత్కరించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu