HomeTelugu Newsహీరో విశాల్‌కు గాయాలు

హీరో విశాల్‌కు గాయాలు

1 27ప్రముఖ తమిళ హీరో విశాల్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన సీ. సుందర్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. చిత్రీకరణ టర్కీలో జరుగుతోంది. అక్కడి రోడ్లపై భారీ యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా విశాల్‌ బైక్‌ అదుపుతప్పి పడిపోయారు. దాంతో ఆయన ఎడమ చేతికి, ఎడమ కాలికి గాయమైంది. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చేతికి, కాలికి కట్టుకట్టి ఉన్న విశాల్‌ ఫొటోను చిత్రవర్గాలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాయి. త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు విశాల్‌కు ట్విటర్‌లో ట్యాగ్‌ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. వైద్యులు రెండు వారాల పాటు విరామం తీసుకోవాలని సూచించారట. ఆ తర్వాత ఆయన భారత్‌కు తిరిగివస్తారు. ప్రస్తుతం విశాల్‌ నటిస్తున్న సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఆయన నటించిన ‘అయోగ్య’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu