HomeTelugu Newsశ్రీవిష్ణు 'తిప్పరా మీసం'

శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’

రొటీన్‌కు భిన్నంగా విలక్షణమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు. శ్రీవిష్ణు ‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు . సినీ విశ్లేషకులు ఈ సినిమాకు, సినిమాలోని అతడి నటనకు అద్భుతమైన రివ్యూలు ఇచ్చారు. అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్‌ మదిలో లాంటి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తూ వస్తోన్న ఈ యువ హీరో తాజాగా మరో చిత్రాన్ని మొదలుపెట్టారు.

10 5

 

శుక్రవారం (జూన్‌ 22) ఉదయం ఈ కొత్త సినిమాను షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నారా రోహిత్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నారా రోహిత్‌ క్లాప్‌ కొట్టారు. “తిప్పరా మీసం”అనే టైటిల్‌కు తగ్గట్టుగా గుబురు గడ్డంతో మాస్‌​లుక్‌లోకి మారిపోయారు శ్రీవిష్ణు. ఈ సినిమాకు ‘అసుర’ ఫేం కృష్ణ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu