బన్నీ నెక్స్ట్ మూవీ దర్శకుడు ఎవరు‌?

నా పేరు సూర్య సినిమా తరువాత ఇంత వరకు స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ మరో సినిమా అంగీకరించలేదు. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవటంతో తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బన్నీ. ఇప్పటికే విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్‌ టీం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. యువ దర్శకులు మారుతి, గీత గోవిందం దర్శకుడు పరశురామ్ లు కూడా బన్నీ కోసం కథ రెడీ చేస్తున్నారట. అంటే విక్రమ్‌ కథను ఇంకా బన్నీ ఫైనల్ చేయలేదా..? లేక విక్రమ్‌ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా బన్నీ లైన్‌లో పెడుతున్నాడా..? అన్న అనుమానాలు మొదలయ్యాయి. కాగా అల్లు అర్జున్ చేయబోయే నెక్స్ట్ సినిమాను నల్లమలుపు బుజ్జి, శానం నాగ అశోక్ కుమార్ లు కలిసి నిర్మిస్తారని సమాచారం.