HomeTelugu Newsసంజయ్‌దత్ బయోపిక్‌ ట్రైలర్ విడుదల

సంజయ్‌దత్ బయోపిక్‌ ట్రైలర్ విడుదల

బాలీవుడ్ స్టార్‌ హీరో సంజయ్‌దత్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందించిన ‘సంజు’ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈసినిమా కోసం సంజు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తాజాగా విడుదలైన సంజు ట్రైలర్ చిత్రంపై అంచనాలను పెంచేసింది. సంజయ్‌దత్ పాత్రలో రణబీర్ కపూర్ చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే సంజయ్‌దత్‌కు బాగా సన్నిహితుడైన హిరానీ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడనే సంకేతాలిస్తోంది.

3 16

రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంజు చిత్రంలో మనీషా కొయిరాలా, సోనమ్ కపూర్‌, పరేష్ రావల్, అనుష్క శర్మ నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్ర యూనిట్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సంజయ్‌దత్ జీవితంలో జరిగిన ఎన్నో ఘటనలతో పాటు ప్రపంచానికి తెలియని ఎన్నో విశేషాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారట. సంజయ్‌దత్ జీవితంలోని డ్రగ్స్, సెక్స్, గర్ల్ ఫ్రెడ్స్, అండర్ వరల్డ్, టెర్రరిస్టులు, జైలు జీవితం వీటన్నిటి ప్రస్తావన సినిమాలో ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. సంజయ్‌దత్ పాత్రలో రణబీర్ కపూర్ బాగా ఒదిగిపోయారని అంటున్నారు. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu