గూగుల్ ఫొటోలు చూసి షాకైన అదితి రావు

యే సాలీ జిందగీ అనే చిత్రంతో 2011లో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది అదితి రావు హైదరి. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సమయంలో తన గురించి సరదాగా గూగుల్‌లో వెతకాలనుకున్నారు. తీరా చూస్తే సినిమాలో దుస్తుల్లేకుండా ఉన్న కొన్ని ఫొటోలు కనిపించడంతో షాకయ్యానని అదితి తెలిపారు. ఆ తర్వాత ఇంకెప్పుడూ తన గురించి గూగుల్‌లో వెతకకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఓ చాట్‌ షోలో పాల్గొన్న అదితి ఈ విషయాన్ని వెల్లడించారు.

పద్మావత్‌, భూమి, వాజిర్‌, మర్డర్‌-3 తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అదితి. తెలుగులో చెలియా, అంతరిక్షం చిత్రాల్లో నటించింది. తమిళంలో సైకో అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘వి’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో నాని, సుధీర్‌బాబు హీరోలు. నివేదా థామస్‌ మరో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates