HomeTelugu Newsతెలుగు రాష్ట్రాల నుంచి 136 మంది బ్రిటన్ వాసులు..!

తెలుగు రాష్ట్రాల నుంచి 136 మంది బ్రిటన్ వాసులు..!

13 13

లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన బ్రిటన్ వాసులను శుక్రవారం తిరిగి వారి స్వస్థలానికి పంపారు అధికారులు. దేశవ్యాప్తంగా నాలుగు వేల మందికి పైగా బ్రిటన్ వాసులు భారత్‌లో చిక్కుకుపోయారు. శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానంలో 136 మందిని తమ సొంత దేశానికి పంపించి వేశారు. వీరందరినీ కూడా దశలవారీగా భారత ప్రభుత్వం తిరిగి వారి దేశాలకు పంపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వున్న 136 మందిని ఇవాళ పంపించి వేశారు. హైదరాబాద్ నుండి బయలుదేరిన ఈ విమానం బెహరన్ మీదుగా లండన్ చేరుకుంటుంది. 136 మందికి పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత విమానంలోకి అధికారులు అనుమతించారు. బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో వీరిని పంపించినట్ల శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!