HomeTelugu Trendingఇద్దరు హీరోయిన్‌లతో బాలకృష్ణ

ఇద్దరు హీరోయిన్‌లతో బాలకృష్ణ

2 heroines in balakrishna a

నందమూరి బాలకృష్ణతో హీరోగా మలినేని గోపీచంద్ సినిమా తీయనున్నాడు. ఈ సినిమాకూ కథను తానే తయారు చేసుకున్నాడు. సమాజంలోని కొన్ని సంఘటనల ఆధారంగా బాలకృష్ణ కోసం గోపీచంద్ కథను తయారు చేశాడని తెలుస్తోంది. అందుకే ఆ మధ్య వేటపాలెం లైబ్రరీకీ వెళ్ళి, మెటీరియల్ ను సేకరించుకున్నాడు. తాజా గా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుదుంది. ఈ సినిమాలో బాలకృష్ణతో ఇద్దరు హీరోయిన్‌లు రొమాన్స్‌ చేయబోతున్నారట. ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ‘అఖండ’ సినిమా షూటింగ్ పూర్తి కాగానే బాలకృష్ణ నటించబోయే చిత్రం ఇదేనట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఫస్ట్ టైమ్ బాలకృష్ణ నటిస్తుండటంతో నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారట! ‘క్రాక్’ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి ఊపు మీద ఉన్న మలినేని గోపీచంద్… దీన్ని కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu