ఒక్క సీన్‌ కోసం అమలాపాల్ 20 రోజులు అలా..!


అమలాపాల్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న పేరు. తమిళ సినిమాలతో పాటు.. తెలుగు సినిమాల్లోనూ ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ భామ..తాజాగా నటిస్తున్న సినిమా హాట్ టాపిక్‌గా మారింది. అమలాపాల్ సినిమా’ఆడై’ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌‌లో ఉన్న ఈ ట్రైలర్‌లో అమలాపాల్ న్యూడ్‌గా కనిపిస్తోంది.
కేరళ ముద్దుగుమ్మను ఇలా చూసిన వాళ్లంతా షాక్ అయ్యారు.

అయితే ఈ సినిమాలో ఓ సీన్ కోసమే మళయాల బ్యూటీ ఇలా నటించాల్సి వచ్చింది. ఓ బిల్డింగ్‌లో అమలాపాల్ ఒంటిపై చిన్న వస్త్రం కూడా లేకుండా పడి ఉంటుంది. అయితే సినిమా స్టోరీలోని తీవ్రత, ఇంటెన్సిటీ జనానికి అర్థమవ్వడానికే ఈ న్యూడ్ సీన్ తీశారు. టీజర్‌లో ఇదే సీన్‌ను హైలైట్ చేశారు. ఇలా విడుదలైన టీజర్ ఇంటర్నెట్లో సంచలనం
క్రియేట్ చేసింది.

అయితే ఈ న్యూడ్ సీన్ తీయడానికి మూవీ టీంకు మొత్తం 20 రోజులు పట్టిందట. అయితే ఈ సీన్ చేసి అమలాపాల్ ఓ రికార్డ్ క్రియేట్ చేసిందని తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తమిళ సినీ చరిత్రలో ఏ హీరోయిన్ కూడా ఇలా ఏకంగా 20 రోజుల పాటు వరుసపెట్టి న్యూడ్ సీన్లో నటించలేదని అక్కడి సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అమలా పాల్ మాత్రమే ఇలాంటి సాహసం చేసిందని చర్చించుకుంటున్నారు. కథ కోసం ఇలాంటి సీన్ చేయడానికి ముందుకు వచ్చిన అమలా పాల్‌ను సినీ ప్రముఖుల ప్రశంసిస్తున్నారు.