3 రోజుల్లోనే 11 కోట్లు కలెక్షన్స్!

పివిపి సినిమా బేనర్‌లో ప్రసాద్‌ వి.పొట్లూరి ఎన్నో భారీ చిత్రాలను నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన క్షణం, ద్విభాషా చిత్రంగా రూపొందిన మల్టీస్టారర్‌ ఊపిరి చిత్రాలతో పివిపి సినిమా బేనర్‌కు 2016 సెన్సేషన్‌ ఇయర్‌ అయింది. మళ్ళీ ఇప్పుడు కార్తీ హీరోగా రూపొందిన ‘కాష్మోరా’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన పివిపి మరో బిగ్‌ సక్సెస్‌ను అందుకున్నారు. కార్తీ పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా రూపొందిన ‘కాష్మోరా’ రికార్డ్‌ కలెక్షన్స్‌ సాధిస్తోంది. 3 రోజుల్లోనే  11 కోట్లు కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది.
ఆవారా, యుగానికి ఒక్కడు, నాపేరు శివ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో మంచి ఇమేజ్‌ని సంపాదించుకున్న కార్తీ.. కింగ్‌ నాగార్జునతో కలిసి ద్విభాషా చిత్రంగా చేసిన మల్టీస్టారర్‌ ‘ఊపిరి’ పెద్ద హిట్‌ అయింది. కార్తీకి తెలుగులో కూడా ఫాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. ‘కాష్మోరా’కు వచ్చిన భారీ ఓపెనింగ్సే దానికి నిదర్శనం. ఈ సినిమా కార్తీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సోలో సక్సెస్‌ కాబోతోంది.
డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌తో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన నయనతారకు ‘కాష్మోరా’లో చేసిన క్యారెక్టర్‌ సినిమాకు మరో హైలైట్‌ అయింది. సినిమాలో ఆమె క్యారెక్టర్‌ కనిపించేది కాసేపే అయినా చాలా పవర్‌ఫుల్‌గా వుంటూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
‘కాష్మోరా’ సాధించిన బిగ్‌ సక్సెస్‌తో నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి చాలా హ్యాపీగా వున్నారు. ఈ సందర్భంగా పివిపి మాట్లాడుతూ – ”మా కాష్మోరా చిత్రం దీపావళి బ్లాక్‌బస్టర్‌గా నిలిచినందుకు చాలా హ్యాపీగా వుంది. చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా కార్తీకి, డైరెక్టర్‌ గోకుల్‌కి, టోటల్‌ టీమ్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అన్నారు.
నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి డిఫరెంట్‌ కథాంశాలతో మరిన్ని చిత్రాలు ప్లాన్‌ చేస్తున్నారు. రానా దగ్గుబాటి హీరోగా పివిపి నిర్మిస్తున్న ‘ఘాజి’ చిత్రం ఫిబ్రవరి 24న విడుదల కాబోతోంది. అలాగే ‘ఊపిరి’ వంటి సూపర్‌హిట్‌ తర్వాత కింగ్‌ నాగార్జునతో మరో చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు పివిపి. ఓంకార్‌ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘రాజుగారి గది2’ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు పివిపి అధినేత  ప్రసాద్‌ వి.పొట్లూరి.
 
 
CLICK HERE!! For the aha Latest Updates