రజనీని కలిసిన మేరీ కోమ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో ‘2.0’ ప్రమోషన్స్ బిజీలో ఉన్నాడు. ఇటీవలే పెట్ట సినిమాను కూడా పూర్తి చేశారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11 న రిలీజ్ కాబోతున్నది. ఇలా వరస సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. రజినీకాంత్ మక్కల్ మందిరం పార్టీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలను రజినిపార్టీ పరిశీలిస్తున్నది.

ఇదిలా ఉంటె, ఇండియన్ లేడీ బాక్సర్, ఒలంపిక్ మెడలిస్ట్ మేరీ కోమ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిసింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. మేరీ కోమ్ ఎందుకు కలిసింది అనే విషయం మాత్రం తెలియడంలేదు.