HomeTelugu Trending'83' మూవీ ట్రైలర్‌

’83’ మూవీ ట్రైలర్‌

83 movie trailer
టీమ్‌ఇండియా మాజీ సారథి, 1983 ప్రపంచకప్‌ విజేత జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. ఈ సినిమాలో కపిల్‌దేవ్‌ పాత్రను రణ్‌వీర్‌సింగ్‌ పోషించారు. కపిల్‌దేవ్‌ దీపికా పదుకొణె నటించారు. కబీర్‌ఖాన్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ట్రైలర్‌లో అప్పటి ప్రపంచకప్‌ ఎలా సాగిందో చూపించే ప్రయత్నం చేశారు. మెగా టోర్నీలో భారత జట్టు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆనందక్షణాలను క్లుప్తంగా చూపించారు.

ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్‌ 24న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 3డీ వెర్షన్‌లోనూ చిత్రం విడుదలవుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి ఊహించని విధంగా విజయం సాధించిన నిజ జీవిత అద్భుతమైన కథ. ట్రైలర్‌ మీకోసం’ అంటూ రణ్‌వీర్‌ సింగ్‌ చిత్రం హిందీ ట్రైలర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేయగా.. తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌ను టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని కూడా తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జునే విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!