కొండచిలువను మెడలో వేసుకున్న కాజల్‌.. వీడియో వైరల్

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ థాయ్‌లాండ్‌లోని నఖోమ్‌ పాథోమ్‌ ప్రావిన్స్‌లో జరుగుతోంది. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా కాజల్‌.. ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకున్నారు. ఆ సమయంలో తీసిన వీడియోను కాజల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. కొండచిలువను పట్టుకున్నప్పుడు ఆమె తెగ కంగారుపడిపోయారు. కానీ ఆమె పక్కనే పర్యవేక్షకులు ఉండడంతో ధైర్యంగా పట్టుకోగలిగారు.

ఆ సమయంలో కాజల్ ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి.. ‘కాజల్‌ నువ్వు పాము స్పర్శను గ్రహించగలుగుతున్నావా?’ అని అడిగారు. ఇందుకు కాజల్‌… ‘అవును. నాకు దాని కండరాల కదలిక తెలుస్తోంది. బుసలు కొడుతున్న విషయమూ తెలుస్తోంది’ అని చెప్పారు. ‘ఇదొక గొప్ప అనుభూతి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్‌ పెట్టారు. ఈ వీడియోను దర్శకుడు తేజ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను లక్ష 44వేల మంది వీక్షించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై కాజల్‌-శ్రీనివాస్‌ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. తేజ-కాజల్‌ కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రమిది.

View this post on Instagram

WHAT AN EXPERIENCE

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on