రీల్‌ కపిల్‌ దేవ్‌ భార్యను చూశారా..

Romi Bhatia First look in Kapil dev baiopic '83'

1983 భారత్ క్రికెట్‌లో ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘83’ బయోపిక్‌లో జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తుండగా..ఆయన భార్య రోమి భాటియా (రోమి దేవ్) పాత్రలో దీపికా పదుకొణే నటిస్తుంది. పెళ్లి తర్వాత రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే నటిస్తున్న మొదటి సినిమా ఇదే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. క్రికెట్ కోసం జీవితాన్ని అంకితం చేసిన కపిల్‌ దేవ్ వ్యక్తిగత జీవితంలో అండగా నిలిచిన ఆయన విజయంలో తన వంతు సాయం చేసిన రోమి దేవ్ పాత్రకు మంచి డిమోండ్‌ ఉంది. అందుకే ఈ సినిమాలో ఆ పాత్ర కోసం దీపికాను ఎంపిక చేసున్నారు.

తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను అఫీషియల్‌గా విడుదల చేసారు. ఈ చిత్రంలో భార్యాభర్తలైన కపిల్ దేవ్, రోమి దేవ్ మధ్య అనుబంధం హైలెట్ అని చెబుతున్నారు. ఇప్పటి వరకు వీళ్లిద్దరు కలిసి నటించిన ప్రతి సినిమాలో వీళ్లద్దరు చనిపోయే పాత్రల్లోనే నటించారు. కానీ ఫస్ట్ టైమ్ పెళ్లి తర్వాత సుఖాంతం అయ్యే కథలో నటించడం విశేషం. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విష్ణు వర్ధన్ ఇందూరి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్‌తో పాటు పలు నిర్మాణ సంస్థలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ వేసవిలో ఏప్రిల్ 10న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. కాగా వీరిద్దరు పెళ్లికాక ముందే .. ‘రామ్ లీలా’, ‘బాజీ రావ్ మస్తానీ’ వంటి సినిమాల వెండితెరపై తమ అద్భుతమైన నటనతో కెమిస్ట్రీ పండించారు.

CLICK HERE!! For the aha Latest Updates