ఆ విషయంలో ఎవరు ఒత్తిడి చేయలేదు!

తెలుగు, తమిళ, కన్నడ బాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది నటి కేథరిన్ ట్రెసా. ఇటీవల మెగాస్టార్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశాన్ని పోగొట్టుకున్నా .. ఏ మాత్రం నిరాశ పడకుండా కడంబన్, కథానాయకన్ అనే రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

కేరళలో పుట్టినప్పటికీ అమ్మడు పెరిగిందంతా దుబాయిలోనే.. కన్నడ సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే అప్పటి నుండి తెలుగు, తమిళ అవకాశాల కోసం ఎంతగానో ఎదురు చూశానని చెప్పుకొచ్చింది. ఎందుకంటే నటన పరంగా ఈ రెండు బాషల్లో తన ప్రతిభను చాటే అవకాశం ఎక్కువగా ఉంటుందనేది ఆమె భావన.

అయితే ఇప్పటివరకు ఏ దర్శక, నిర్మాత కూడా తనపై గ్లామర్ విషయంలో ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదట. ఖచ్చితంగా గ్లామరస్ గా నటించి తీరాలని ఏ డైరెక్ట్ చెప్పలేదని అంటోంది ఈ బ్యూటీ. అయితే నా వరకు నేను తెరపై అందంగా కనిపించాలి.. నా శరీరానికి సూట్ అయ్యే విధంగా బట్టలు సెలెక్ట్ చేసుకుంటానని వెల్లడించారు.