HomeTelugu Trendingఈగల్‌: ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

ఈగల్‌: ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

Aadu Macha Lyrical Song fro
టాలీవుడ్ హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఈగల్‌. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు, స్టైలిష్ లుక్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈగల్ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్‌ సాంగ్ ప్రోమోను లాంఛ్ చేశారని తెలిసిందే.

రాహుల్ సిప్లిగంజ్‌ పాడిన ఈ పాటలో రవితేజ నయా మాస్‌ అవతార్‌లో కనిపిస్తున్నాడు. తాజాగా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు. ఫ్యాన్స్ ఊరమాస్ ట్రీట్ ఖాయమని వీడియో సాంగ్ చెబుతోంది. ఈగల్‌ను 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. మంటలు చెలరేగుతున్న ఓ ఇంటి ముందు పిస్తోల్‌ పట్టుకుని కాన్సెప్ట్‌ పోస్టర్‌తో సినిమాలో విధ్వంసం అంటే ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.

ఈగల్‌లో కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu