HomeTelugu Trendingఅవికా గోర్ వధువు వెబ్ సిరీస్

అవికా గోర్ వధువు వెబ్ సిరీస్

Avika gor web series

Avika Gor: బుల్లితెరపై చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అవికాగౌర్. ఆ తర్వాత హీరోయిన్ కూడా నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. 2013లో ఉయ్యాలా జంపాల మూవీతో తెలుగులో తొలిసారి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయినా అవికాకు అంతగా అవకాశాలు రాలేదు.

అవికా ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవలే మాన్షన్ 24, 1920 వంటి హారర్ సినిమాలతో అలరించింది. ఇప్పుడు వధువు అనే సరికొత్త వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి రానుంది అవికా గోర్.

వధువు వెబ్‌ సిరీస్‌లో అవికాతో పాటు నందు, అలీ రెజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్వీఎఫ్ బ్యానర్‌లో శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు.

ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. వధువు సిరీస్ ప్రమోషన్లలో పెళ్లి గురించి అవికా గోర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

“చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ చేసేటప్పుడు నాకు పదేళ్లు. అప్పటికీ పెళ్లంటే ఏమిటో తెలియదు. పెళ్లి కూతురు అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంట్లో ఎలా వ్యవహరించాలి వంటి విషయాలపై నాకు ఏమాత్రం అవగాహన లేదు” అని అవికా గోర్ చెప్పింది.

ఏమైనా సందేహం వస్తే డైరెక్టర్‌ను అడిగేదాన్ని. ఆ సమయంలో పూర్తిగా దర్శకుడిపై ఆధారపడేదాన్ని. ఇప్పుడు వధువు వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు అలాంటి ఇబ్బంది పడలేదు. అప్పటికీ ఇప్పటికీ నా దృష్టికోణం మారిపోయింది. అందుకే వధువు కోసం పెళ్లి పీటలపై కూర్చున్నప్పుడు సహజంగా నటించాను” అని అవికా గోర్ చెప్పుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu