రాజమౌళికి అమీర్ షాక్!

బాహుబలి లాంటి బారీ బడ్జెట్ చిత్రం తర్వాత అదే స్థాయిలో మహాభారతం సిరీస్ తీయాలని రాజమౌళి చిరకాల వాంచ.   ఇందు కోసం అప్పట్లో కాస్త హడావుడి కూడా చేశారు..కాని ఇప్పటికీ అది సస్పెన్స్ గానే ఉంది.  ఎప్పటికైనా  అంతర్జాతీయ స్థాయిలో ఈసినిమాను తెరకెక్కించే ఆలోచన ఉన్నట్టుగా ప్రకటించాడు రాజమౌళి.  కాకపోతే రాజమౌళి సినిమా పనులు మొదలు కాకముందే మరిన్ని మహాభారతాలు మొదలవుతున్నాయి. 

ఇప్పటికే మలయాళ నటుడు మోహన్ లాల్ కీలక పాత్రలో రంథమూలం నవల ఆధారంగా 1000 కోట్ల బడ్జెట్ తో మహాభారతాన్ని తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు, ఈ సినిమాలో మోహన్ లాల్ భీముడి పాత్రలో నటిస్తున్నాడు.  తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రతిష్టాత్మకంగా ‘మహాభారతం’ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న థగ్ ఆఫ్ హిందుస్తాన్ పనులు పూర్తయిన వెంటనే మహాభారతంలో తొలి భాగాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.