100 శాతం ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, న‌వ్వించ‌డం కోసం తీసిన సినిమా `ఆటాడుకుందాం.. రా` -`స‌క్సెస్‌మీట్‌`లో జి.నాగేశ్వ‌ర‌రెడ్డి

100 శాతం ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, న‌వ్వించ‌డం కోసం తీసిన సినిమా `ఆటాడుకుందాం.. రా`
                                      -`స‌క్సెస్‌మీట్‌`లో జి.నాగేశ్వ‌ర‌రెడ్డి
 
యంగ్‌ హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీజి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మించిన చిత్రం `ఆటాడుకుందాం..రా`(జస్ట్‌ చిల్‌). ఈ శుక్ర‌వారం (ఆగస్టు 19) ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రిలీజై చ‌క్క‌ని ఓపెనింగ్స్ సాధించింది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్‌లో స‌క్సెస్‌మీట్ నిర్వ‌హించింది. 
 
ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి మాట్లాడుతూ –“మేం ఈ సినిమా తీసిందే ఎంట‌ర్‌టైన్మెంట్ కోసం.. న‌వ్వించ‌డం కోసం ..చెప్పిందే తీశాం. టైమ్ మెషీన్ నేప‌థ్యంలో కామెడీ సినిమాకే హైలైట్‌. ఆ పాయింట్ అంద‌రికీ క‌నెక్ట‌వుతుంద‌ని తొలి నుంచీ అనుకుని తీశాం. థియేట‌ర్ల‌లో జ‌నాల‌కు అవి బాగా క‌నెక్ట‌యి న‌వ్వుకుంటూ బైటికి వెళుతున్నారు. ఓ ఇద్ద‌రు ఎలా క‌లిశారు? ఎలా స్నేహితుల‌య్యారు? అన్న‌ది చూపించాం. మ‌నిషి మ‌రో మ‌నిషిని ఎప్పుడూ ఎక్క‌డా మోసం చేయ‌కూడ‌దు.. అన్న కాన్సెప్టు తో తీసిన చిత్ర‌మిది. బ్ర‌హ్మానందం టైమ్ మెషీన్‌లోకి వెళ్ల‌డం, మోసంకి సంబంధించిన‌ స‌న్నివేశాలు హైలైట్‌. అవ‌న్నీ జ‌నాల్ని థియేట‌ర్ల‌లో చ‌క్క‌గా న‌వ్విస్తున్నాయి. హీరో సుశాంత్ ఈ సినిమాలో చాలా బావున్నాడు. త‌న గెట‌ప్‌, కాస్ట్యూమ్స్ అన్నీ చాలా బావున్నాయ‌ని ప్ర‌శంస‌లొచ్చాయి. బ్ర‌హ్మీ- మోసం అన్న టాపిక్ జ‌నాల్ని బాగా ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. అలాగే పోసాని కృష్ణ‌ముర‌ళి విల‌నీలో కామెడీ చేశారు. తొలి సీన్ నుంచి ఆద్యంతం ర‌క్తి క‌ట్టించారాయ‌న‌. పృథ్వీ ఓ ఇన్నోసెంట్ డైరెక్ట‌ర్‌గా క‌నిపించారు. మ‌నిషిని మోసం చేయ‌కూడ‌దు అని చెబుతూ ముర‌ళి శ‌ర్మ‌పై తీసిన సీన్స్ అద్భుతం. వీటికి రెస్పాన్స్ బావుంది. న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌, క్లైమాక్స్ పాటల‌కు విజిల్స్ ప‌డ్డాయి. అలాగే అఖిల్ సాంగ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. నాగార్జున సాంగ్ అంత ఎంజాయ్ చేశారు. ఇదో పూర్తి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. అన్ని బాధ‌ల్ని మ‌ర్చిపోయి ఆస్వాధించే సినిమా.  శ్రీ‌ధ‌ర్ సీపాన సంభాష‌ణ‌లు అద్భుతంగా ఉన్నాయ‌న్న ప్ర‌శంస వ‌చ్చింది. ఈ సినిమాని 25 కోట్ల తో తీసిన సినిమాలా రిచ్‌గా తీశావంటూ బ్ర‌హ్మానందం ప్ర‌శంసించారు. నా నిర్మాత‌ల ఎఫ‌ర్ట్ అదంతా. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత చింత‌ల‌పూడి శ్రీ‌నివాస‌రావు రాజీ లేకుండా పెట్టుబ‌డులు పెట్టారు. ప్ర‌మోష‌న్ అంతే బాగా చేశారు. అందుకే ఇంత పెద్ద విజ‌యం అందుకున్నాం. క‌లెక్ష‌న్ల ప‌రంగా పంపిణీదారులంతా చాలా సంతోషంగా ఉన్నారు“ అన్నారు. 
 
ర‌చ‌యిత శ్రీ‌ధ‌ర్ సీపాన మాట్లాడుతూ -“ఈ సినిమా క‌థ రాసుకునేప్పుడు.. కేవ‌లం హీరో – హీరోయిన్ మాత్ర‌మే కాదు.. ఇంకేదైనా స్పెషాలిటీ క‌థ‌లో ఉండాల‌నుకున్నాం. అలా టైమ్ మెషీన్ ఆలోచ‌న వ‌చ్చింది. 50 సంవ‌త్స‌రాల‌కు ముందు, 50 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌కు వెళితే ఎలా ఉంటుంది? అన్న థాట్ వ‌చ్చింది. ఆ థాట్‌లోంచే బోలెడంత కామెడీ పుట్టింది.. సినిమా నిల‌బడేందుకు ఈ కాన్సెప్టు పెద్ద ప్ల‌స్‌ అయ్యింది. బ్ర‌హ్మానందంని బేస్ చేసుకునే టైమ్ మెషీన్ కామెడీని పుట్టించాం. సుశాంత్ ఇదివ‌ర‌కూ సినిమాల్ని మించి చేశాడు. డ్యాన్సులు, న‌ట‌న‌లో ఎంతో శ్ర‌మించాడు. నాకు ప‌రిశ్ర‌మ‌లో తొలి అవ‌కాశం ఇచ్చింది జి.నాగేశ్వ‌ర‌రెడ్డి గారు. ఆయ‌న వ‌ల్ల‌నే మ‌రో మంచి విజ‌యం ద‌క్కింది. థియేట‌ర్ల నుంచి క‌డుపుబ్బా న‌వ్వుకుంటూ వెళ్లే సినిమా ఇది. అంద‌రూ ఆస్వాదించండి“ అన్నారు. 
 
హీరో సుశాంత్ మాట్లాడుతూ –“తొలి నుంచి మేం న‌మ్మింది ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. ఆ థాట్‌తోనే ఈ సినిమా తీశాం. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు ఆద్యంతం న‌వ్వుతూనే ఉండ‌డం ఆనందాన్నిస్తోంది. గ‌తంలో ప్రేమ‌క‌థ‌లు, మాస్ స్టోరీస్‌లో న‌టించాను. మొద‌టిసారి పూర్తి వినోదం పంచే సినిమాలో న‌టించాను. నేను బాగా శ్ర‌మిస్తున్నాన‌ని కాంప్లిమెంట్ ఇవ్వ‌డం కొత్త ఎన‌ర్జీనిచ్చింది. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్ర‌మిది. అతిధిగా చైత‌న్య రోల్ ఆక‌ట్టుకుంది. తొలినుంచీ ఆ పాత్ర స్క్రిప్టులోనే ఉంది. ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య క‌థ‌ను టైమ్ మెషీన్ కి క‌నెక్ట్ చేస్తూ తీసిన విధానం బావుంది. నా నిర్మాత‌లు తొలినుంచి సినిమాకి చ‌క్క‌ని ప్ర‌మోష‌న్ చేశారు. స‌క్సెస్ ఇచ్చిన ప్రేక్ష‌కాభిమానుల‌కు థాంక్స్‌“ అన్నారు. 
 
నిర్మాత చింత‌ల‌పూడి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ –“ఏపీ, నైజాం, సీడెడ్‌, అమెరికా .. ఇలా ప్ర‌పంచ‌మంతా మూవీ రిలీజ్ చేశాం. అన్నిచోట్లా స్పంద‌న బావుంది. ప్ర‌సాద్ లాబ్స్‌లో కామ‌న్ ఆడియెన్‌కి మా సినిమా చూపించాం. అంద‌రి నుంచి స్పంద‌న బావుంది. ఈ ఆదివారం నుంచి థియేట‌ర్ల‌ను సంద‌ర్శించి ప్ర‌మోష‌న్ చేయ‌నున్నాం. విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, తిరుప‌తి వంటి చోట్ల థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కాభిమానుల్ని క‌లిసి ప్ర‌చార‌కార్య‌క్ర‌మాలు చేపట్ట‌నున్నాం. నాగేశ్వ‌ర‌రెడ్డి గ‌త సినిమాల్ని మించిన కంటెంట్‌తో చ‌క్క‌గా తెర‌కెక్కించారు. క‌థ‌కు త‌గ్గ‌ట్టే రాజీకి రాకుండా పెట్టుబ‌డులు పెట్టాం. విజువ‌ల్ బేస్డ్ కామెడీ ని ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. హీరో సుశాంత్ గ‌త సినిమాల్ని మించి అద్భుత పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. టైమ్ మెషీన్ బ్యాక్‌డ్రాప్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది“ అన్నారు. 
 
మ‌రో నిర్మాత నాగ‌సుశీల మాట్లాడుతూ –“థియేట‌ర్ల‌లో చ‌క్క‌ని స్పంద‌న వ‌స్తోంది. పార్క్‌లో వాకింగ్ ఫ్రెండ్సుకి సినిమా చూపించాం. జెన్యూన్ రిపోర్టు చెప్పారంతా. ఆడ‌వాళ్లు, కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్ర‌మిద‌న్న ప్ర‌శంస‌లొచ్చాయి. అస‌భ్య‌త‌కు తావు లేని చిత్ర‌మిది. చ‌క్క‌ని విజ‌యాన్ని అందించిన అక్కినేని అభిమానులు, తెలుగు ప్రేక్ష‌కుల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు“ అన్నారు. 
CLICK HERE!! For the aha Latest Updates