‘అభినేత్రి 2’ టీజర్‌

ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘అభినేత్రి 2’. నందితా శ్వేత, కోవై సరళ, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 2016లో వచ్చిన ‘అభినేత్రి’కి సీక్వెల్‌ ఇది. ఈ సినిమాను మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ‘దేవి 2’ టైటిల్‌తో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ‘దెయ్యమా.. అయ్యో దెయ్యమయ్యా.. ఒక్క దెయ్యం కాదు రెండు దెయ్యాలు..’ అంటూ కోవై సరళ తెగ భయపడుతూ కనిపించారు.

CLICK HERE!! For the aha Latest Updates