HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌ నుంచి సామాన్యులు ఔట్‌

బిగ్‌బాస్‌ నుంచి సామాన్యులు ఔట్‌

తెలుగు బిగ్‌బాస్‌లో అంతంత మాత్రమే పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు.. ఆపై కొత్తగా హోస్టింగ్ చేస్తున్న నాని.. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా అంటున్నాడు. 15 ఎపిసోడ్‌లో పూర్తైతేనే కాని నానిలోని నటన బయటకు రాలేదు. గత రెండు వారాలతో పోలిస్తే.. ఈ వారం నాని హోస్టింగ్ కొంచెం బాగుందనిపించింది. అయితే హౌస్‌మేట్స్‌ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అవే ఇక ఇకలు.. పక పకలు, ప్రేక్షకులు ఆశించినంతగా ఏ మాత్రం వినోదం లభించడం లేదు. ఎలాగైతేనేం తొలి సీజన్‌కు ఎన్టీఆర్ ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌ కి తోడు సీజన్‌ 2‌కు విపరీతమైన ప్రచారం చేయడంతో రేటింగ్స్‌లో ‘స్టార్ మా’ దూసుకొళ్తోంది. అయితే రేటింగ్ వచ్చినంత మాత్రనా ప్రేక్షకులు ఈ షో పట్ల ఆకర్షితులౌతున్నర అంటే కాదు అనే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

5 22

 

ఈ నెల 10వ తేదిన బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా ప్రచారం కల్పిస్తూ వచ్చిన ‘బిగ్ బాస్-2’ 15 ఎపిసోడ్‌లు పూర్తయ్యాయి. ఇంకాస్త మసాలా.. ఏదైనా జరగొచ్చు అంటూ నాని టీ గ్లాస్ ఇచ్చిన ప్రచారనికి ప్రేక్షకులంతా హర్షం వ్యక్తం చేశారు. అయితే తొలిరోజే తన హోస్టింగ్‌ నాని నిరుత్సాహ పరిచాడు. అయితే హోస్టింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. 16 మంది సెలబ్రిటీలతో.. కోట్లాది మంది ప్రేక్షకుల్ని అలరించాలంటే అందరి వల్ల సాధ్యం కాదు. ఈ విషయంలో ఎన్టీఆర్ కంటే నాని కొంచెం వెనుకే ఉన్నారు. అయితే ఇక్కడ పోలిక అనేది కరెక్ట్ కాదు కాని ‘బిగ్ బాస్’ హోస్ట్ అంటే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు కాబట్టి పోలిక తప్పనిసరి అయ్యింది.

అసలు విషయానికి వస్తే.. బిగ్ బాస్ సీజన్‌ 1లో ఎక్కువగా ఆడియన్స్ నుండి వినిపించిన మాట సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా బిగ్‌బాస్‌లో ఉంటే బాగుంటుందనేది ప్రేక్షకుల అభిప్రాయం. దీంతో సీజన్ 2లో ప్రేక్షకుల కోరిక మేరకు 17 మంది కంటెస్టెంట్స్‌లో (వైల్డ్‌కార్డు ఎంట్రీతో వచ్చిన నందినితో కలిపి) ముగ్గుర్ని సామాన్యుల కోటాలో ఎంపిక చేయడం ఆహ్వానించదగిన విషయం. ఇందులో భాగంగా నూతన్ నాయుడు, సంజనా అన్నే, గణేష్‌లను సామాన్యుల కోటాలో బిగ్ బాస్ రియాలిటీ షో‌కి ఎంపిక చేశారు. ఓ లక్షమందిని జల్లెడ పట్టి మరీ ఈ ముగ్గుర్నీ సెలెక్ట్ చేశాం. బిగ్ బాస్‌లో కామన్ మేన్ అంటూ పెద్దగా ప్రచారం చేసుకున్నారు ‘స్టార్‌ మా’ సంస్థ. సామాన్యుల కోటాలో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన మోడల్ సంజనాను తొలివారంలోనే ఇంటికి పంపేశారు. ఇక మిగిలింది ఇద్దరు వారిలో ఒకరు నూతన్ నాయుడు అయితే రెండోది గణేష్. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో నూతన్ నాయుడిని కూడా గెటౌట్ అన్నారు ప్రేక్షకులు అందుకే మేం కూడా గేట్లు ఎత్తేశాం అంటూ బిగ్ బాస్ హౌస్ నుండి నూతన్ నాయుడిని ఎలిమినేట్ చేశారు. ఇక ఫైనల్‌గా సామాన్యుల కోటాలో మిగిలింది ఒకే ఒక్కడు గణేష్. అయితే ఇతడి పెర్ఫామెన్స్ కారణం చూపి నెక్స్ట్ వీక్ లేదా.. ఆ తరువాత వీక్‌లోను గ్యారంటీగా గెటౌట్ అంటారు.

5 21

ఇక్కడ విషయం ఏంటంటే.. హౌస్‌లో 17 మంది సెలబ్రిటీలు ఉంటే కామన్ మేన్‌నే ఎలిమినేట్ చేయడం ఏంటనేది సామాన్యుడి ప్రశ్న. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే సామాన్యులుగా అడుగుపెట్టినంత మాత్రానా ఎలిమినేట్ చేయకూడదనే రూల్ ఏమీ లేదు. కాని పెర్ఫామెన్స్ పూర్‌గా ఉండటం వల్ల ప్రేక్షకులే ఎలిమినేట్ చేశారనేది నమ్మేలా కనిపించడం లేదు. .. సంజనా అన్నే, నూతన్ నాయుడు పెర్ఫామెన్స్ బాలేదు ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేశారనే అనుకుందాం.. మరి మిగిలిన 15 మంది పెర్ఫామెన్స్‌తో అదగగొట్టేస్తున్నారా? ఒక్కరంటే ఒక్కరైనా ఇప్పటి వరకూ ప్రేక్షకులకు గుర్తుండిపోయే పెర్ఫామెన్స్ చేశారా.. అంటే అదీ లేదు. నిజానికి ఈ షో ప్రారంభమైన తొలి వారంలో ఎక్కువగా ఫోకస్ అయ్యింది మోడల్ సంజనా. వచ్చిన తొలిరోజే జైల్‌కి పంపేశాడు బిగ్ బాస్. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ అన్యాయాన్ని అదేపనిగా ప్రశ్నించింది. అయితే కొందరికి నచ్చక ఎలిమినేట్ చేశారనే అనుకుందాం. ఆమె ఉన్న ఎపిసోడ్‌లలో సంజనా తప్పితే వేరే వాళ్లు ఫోకస్ అయిన సందర్భాలైతే లేవు.

ఇక నూతన్ నాయుడు.. ఓవరాల్ బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్‌లలో 13, 14 ఎపిసోడ్‌లలో నాని చెప్పిన మసాలా, ఉప్పు, కారం, చేదు లాంటివి కనిపించాయి. దీనికి కారణం నూతన్ నాయుడే అని చెప్పాలి. ఎందుకంటే హౌస్ కెప్టెన్‌గా ఉన్న సామ్రాట్ పై.. నూతన్ నాయుడు ఫైర్ అయ్యడం, తనీష్, కౌశల్ కొట్టుకునేంత వరకూ వెళ్లింది. అయితే ఇదంతా ‘మీ ఇంట్లో ఏం నేర్పించలేదా’ అన్న ఒకే ఒక్కమాట కారణంగా జరిగింది.. ఈ షో కి కావాల్సిన మసాలాను రాబట్టిడంలో భాగమే అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నాటకీయంలో నూతన్ నాయుడుదే ముఖ్య పాత్ర.

ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న దీప్తి, బాబు గోగినేనిలు ముందే సేఫ్ అని ప్రకటించేశారు నాని. ఇక మిగిలింది కౌశల్, గణేష్, నూతన్ నాయుడు.. నిన్నటి ఎపిసోడ్‌లో నూతన్ నాయడిని బయటకు పంపేశారు. పైగా బిగ్ బాస్ హౌస్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి శిక్షలు విధించే బిగ్ బాస్‌ను ‘రా.. రా బిగ్ బాస్’ అంటూ పిలివడమే కాకుండా ఏ ఒక్క టాస్క్‌లోనూ బాబు గోగినేని పాల్గొనలేదు. హేతువాద భావం ఉన్న బాబు గోగినేని తనకు నచ్చని, ఇష్టం లేని వాటిని కుండ బద్దలు కొట్టినట్లు నేను చేయను.. నేను ఆడను.. ఏం చేస్కుంటారో చేసుకోండి అంటూ బిగ్ బాస్‌కే సవాల్‌ విసరడం చూశాం. ఈయనతో పోల్చుకుంటే నూతన్ నాయుడు చాలా యాక్టివ్‌గా టాస్క్‌లను పాల్గోనేవాడు. విచిత్రం ఏంటంటే బాబు గోగినేనికి నాని క్షమపణ చెప్పిమరీ ఎలిమినేషన్ నుండి మీరు సేఫ్ అని ప్రకటించడం.

సరే ఏదైతేనేం ఇద్దరు సామాన్యులు ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలింది గణేష్ మాత్రమే. ఈయన కూడా వచ్చే వారమో లేక తరువాత వారమో ఎలిమినేట్ కావడం ఫిక్స్ అని పరిస్థితిని బట్టి ప్రేక్షకులకు అర్థం అయ్యింది. నన్ను బిగ్ బాస్ హౌస్‌ నుండి పంపేయండ్రా బాబు అంటున్న కౌశల్‌ని.. గోడమీద పిల్లిలా నటించే కిరీటిని.. నలుగురితో నారాయణ అన్నట్లుగా ప్రవర్తించే దీప్తి, శ్యామల, రోల్ రైడా, తనీష్, గీతా మాధురి లాంటి వాళ్లందరూ బిగ్ బాస్‌లో హాయిగా ఉంటే మంచి వినోదాని ఇస్తున్న సామాన్యుల్ని ‘బిగ్ బాస్’ బయటకు సాగనంపడం వాళ్లని సెలబ్రిటీల ముందు కించపరిచేల ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu