‘ధృవ’ పవర్ చూపిస్తున్నాడు!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధృవ’. శుక్రవారం విడుదలయిన ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా రిజల్ట్ పట్ల దర్శకనిర్మాతలు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మకానికి పెట్టేసినట్లు సమాచారం.

దాదాపు తొమ్మిదిన్నర కోట్ల రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను కొనుక్కోవడానికి జెమినీ టీవీ వారు ముందుకు రావడం విశేషం. ఈ సినిమా సుమారుగా యాభై కోట్ల బడ్జెట్ తో రూపొందింది. అలాంటిది కేవలం శాటిలైట్ రూపంలో అంత మొత్తం రావడం విశేషంగా  చెప్పుకుంటున్నారు. మొత్తానికి ధృవ తన పవర్ చూపించడానికి సిద్ధమైపోతుంది. ఇక
కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో.. మరో రెండు రోజుల్లో తెలియనుంది!