నిఖిల్ దుబాయ్ కి చెక్కేశాడు!

యంగ్ హీరోల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు నిఖిల్. అతడి సినిమా విడుదలవుతుందంటే ఖచ్చితంగా కొత్తదనం ఉంటుందనే నమ్మకంతో ఉంటారు ప్రేక్షకులు. అదే నేపధ్యంలో ఇటీవల విడుదలయిన ‘ఎక్కడకి పోతావు చిన్నవాడా’ చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

ఈ వారం విడుదలయిన చిత్రాలకు పోటీ పడి మరీ కలెక్షన్స్ ను వసూలు చేస్తోంది. సినిమా ఇప్పటికే 20కోట్లు క్రాస్ చేసింది. నిఖిల్ తన దగ్గర పెట్టుకున్న కర్నాటక రైట్స్ కూడా షేర్ దాదాపు కోటి రూపాయలు దాటింది. దీంతో ఆనందంలో మునిగి తేలుతున్నాడు ఈ చిన్నోడు. ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయడానికి, తను ప్రస్తుతం నటిస్తోన్న ‘కేశవ’ సినిమా షూటింగ్ నుండి రెస్ట్ తీసుకోవడానికి ఈ హీరో దుబాయ్ కు వెళ్లిపోయాడు. వారం రోజుల పాటు అక్కడే స్నేహితులతో గడిపి తిరిగి హైదరాబాద్ రానున్నాడు.